మనసంతా తిండి మీదే! | Health Tips, Food Obsession Explained, Why You Can't Stop Thinking About Eating And How To Control Constant Hunger | Sakshi
Sakshi News home page

మనసంతా తిండి మీదే! ఆ రీజన్‌ వల్లే ఈ సమస్య..

Oct 29 2026 10:02 AM | Updated on Oct 29 2026 11:37 AM

Health Tips: Food Obsession: Why You Cant Stop Thinking About Eating

నాకు ఒక సంవత్సరం నుంచి సమయంతో పనిలేకుండా విపరీతంగా ఆకలి అవుతోంది. తిన్న పది నిమిషాలకే మళ్లీ ఆకలవుతుంది. ఇలా రోజుకు ఆరేడుసార్లు భోంచేస్తున్నాను. పనిమీద ధ్యాస పోదు, మనసంతా తిండి మీదే ఉంటుంది. దీనివల్ల బాగా బరువు పెరిగాను, ఇంట్లో వారి ముందు చులకనైపోతున్నాను. ఒక్కోసారి చనిపోలనిపిస్తోంది. నా ఈ ఆకలి బాధ తగ్గించే మార్గం చెప్పండి.
 – రవికుమార్, మదనపల్లె

‘గ్రెలిన్‌’ అనే ఒక హార్మోన్‌ ప్రభావం వల్ల కొందరిలో ఆకలి విపరీతంగా పెరుగుతుంది. మానసిక ఒత్తిడికి గురైనప్పుడు కూడా ‘కార్టిసాల్‌’ అనే హార్మోన్‌ విడుదలయి ఆకలిని బాగా పెంచుతుంది. కొందరు మానసిక బాధ నుండి ఉపశమనం పొందేందుకు ఎక్కువగా తింటారు. ‘స్టెరాయిడ్స్‌’లాంటి మందులు వాడటం కూడా ఒక కారణం. డిప్రెషన్, యాంగ్జైటీ లాంటి మానసిక సమస్యలున్నవారు కూడా అతిగా తినే అవకాశం ఉంది.

‘బింజ్‌ ఈటింగ్‌’ ‘బులీమయా నర్వోసా’ అనే ఆరోగ్య సమస్యలున్నవారు కూడా అతిగా తింటారు. ముందుగా మీరు ఒకసారి డాక్టర్‌ చేత తగిన పరీక్షలు చేయించుకుని దానికి తగ్గట్టుగా చికిత్స తీసుకోవాలి. ‘మైండ్‌ ఫుల్‌ ఈటింగ్‌’ అలవాటు చేసుకోవాలి, అంటే తినే సమయంలో నిదానంగా, బాగా నమిలి తినటం. 

టీ.వీ చూస్తూనో, సెల్‌ ఫోన్‌ స్క్రోలింగ్‌ చేస్తూనో తినటం మానేయాలి. ఇలాంటి సందర్భాలలో మనకు తెలియకుండానే ఎక్కువగా తినేయడం జరుగుతుంది.హడావిడిగానో లేదా కబుర్లు చెబుతూనో తినటం వల్ల కూడా మనకు తెలియకుండానే ఎక్కువగా తింటాము. చిన్న ప్లేట్‌ లో తినటం అలవాటు చేసుకోవాలి. ‘ట్రిగ్గర్‌ ఫుడ్స్‌’ అంటే ఇష్టమైన స్వీట్స్, స్నాక్స్‌ను దగ్గరకు రానియవద్దు. 

తరచుగా పార్టీలు, ఫంక్షన్స్‌కు వెళితే ఎక్కువగా తినటం జరుగుతుంది. ఒకవేళ తప్పనిసరి అయి వెళ్లినా ర్టీలో అతిగా తినకుండా ఇంటికి వచ్చి మితం గా ఇంటి భోజనం చేయటం మంచిది. థైరాయిడ్, డిప్రెషన్‌ లాంటి సమస్యలుంటే డాక్టర్‌ గారి సలహాపై మందులు వాడాలి. అతి ఆకలి తగ్గించేందుకు మంచి మందులు కూడా ప్రస్తుతం ఉన్నాయి. 

మందులతో పాటు క్లినికల్‌ సైకాలజిస్టులు, సైకియాట్రిస్టుల పర్యవేక్షణలో ‘కాగ్నిటివ్‌ బిహేవియర్‌ థెరపీ ’ లాంటి మానసిక చికిత్స వల్ల మీ ఆలోచన విధానంలో మార్పు  తీసుకువచ్చి నిగ్రహ శక్తిని పెంచడం వల్ల, మీ తిండి ధ్యాసను తగ్గించవచ్చు. గట్టిగా ప్రయత్నించండి. ఆల్‌ ది బెస్ట్‌! .

డా. ఇండ్ల విశాల్‌ రెడ్డి, సీనియర్‌ సైకియాట్రిస్ట్, విజయవాడ. మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్‌ ఐడీ:  sakshifamily3@gmail.com

ఇదీ చదవండి: మాట గొంతుకలోనే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement