'సదా నామస్మరణం..' పెద్దలు చెప్పిన అద్భుతమైన నీతి! | Devotional And Spiritual Life Story On God Name Chanting Moral Story | Sakshi
Sakshi News home page

'సదా నామస్మరణం..' పెద్దలు చెప్పిన అద్భుతమైన నీతి!

Oct 29 2026 8:12 AM | Updated on Oct 29 2026 8:12 AM

Devotional And Spiritual Life Story On God Name Chanting Moral Story

దత్తబోధ

‘జీవన్నామస్మృతిం కుర్యాత్, నోచేదంతే నసాభవేత్‌.’ బ్రతికి ఉన్నంతకాలం భగవన్నామాన్ని స్మరిస్తూండాలి. అలా చేయకపోతే అవసానదశలో భగవన్నామం గుర్తురాదని దీనర్థం.

భగవన్నామం అలవాటు పడటం కోసమే పిల్లలకు భగవంతుని పేర్లు పెట్టుకొని పిలుచు కోటం! జీవితకాలమంతా లౌకిక వ్యవహారాల్లో మునిగి తేలుతూంటారు మనుష్యులు. ఫలి తంగా బతుకు భారమైపోయి నామస్మరణకు తీరికే లేదంటారు. శరీరంలో ప్రాణం పోయిన తర్వాత ఆ శరీరానికి విలువేముంటుంది? కనుక తనువులో ప్రాణం ఉండగానే జీవితాన్ని ధన్యం చేసుకోవాలి. 

అలవాటు చేస్తే భగవన్నామ స్మరణం కూడా మనస్సుకు పడుతుంది. ఎవరితో మాట్లాడినా ముందు ‘జయగురుదత్త’ అనటం అలవాటు చేసుకోవాలి. అలాగే దత్తవస్త్రం, దత్త కంకణం ధరిస్తే మనస్సులోనూ, ఇతర ఇంద్రియాల్లోనూ మంచి మార్పు వస్తుంది. ఇదే పరమార్థం. ఇలాంటివి అలవాటు పెట్టుకోకపోతే అవసాన కాలంలో డబ్బు, శత్రువులు, ఇల్లు, పిల్లలు వాళ్ళ సంబంధమైన ఆలోచనలే వస్తాయి.

ఒకడు మునగ చెట్టెక్కి చిటారుకొమ్మదాకా వెళ్ళాడు. ఆకాశంలో వెళుతున్న పార్వతి పరమేశ్వరులు చూచారు. కొమ్మ విరిగిపడటానికి సిద్ధంగా ఉండటం చూచి వాళ్ళిద్దరూ జాలి పడ్డారు. రక్షించటానికి నేను ముందంటే నేను ముందని పోటీపడ్డారు. వాళ్ళిద్దరూ ఇలా పోటీ పడుతూంటే నారదుడు వచ్చాడు.

‘మరో రెండు నిమిషాల్లో చెట్టుమీదివాడు కిందపడటం ఖాయం. అందుకని వాడు పడే సమయానికి ఎవర్ని పిలిస్తే వాళ్ళే వెళ్ళటం మంచిద’న్నాడు. సరే అన్నారిద్దరూ. ఆ పడేవాడు అమ్మ అంటాడో, అయ్య అంటాడో అని గమనిస్తున్నారు. ఇంతలో కొమ్మ విరిగింది. చచ్చాన్రో అంటూ కిందపడ్డాడు. చూచారా! ఇతడు కిందపడే సమయంలోనైనా అమ్మో అనో, అయ్యో అనో అని ఉండాల్సింది. అనలేదు. కారణం? వాడికి మొదటినుండి భగవన్నామోచ్ఛారణ అలవాటుండాలి కదా!

- శ్రీ గణపతి సచ్చిదానందస్వామి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement