కొండపైనా క్రెడిట్‌ కొట్టేశారు! | Chandrababu Government Faces Credit Row Over Tirumala Museum And TTD Employees Housing Projects | Sakshi
Sakshi News home page

కొండపైనా క్రెడిట్‌ కొట్టేశారు!

Sep 17 2026 8:22 AM | Updated on Sep 17 2026 9:08 AM

CM Chandrababu Naidu Credit Chori On TTD employees Housing Plots

ఎస్వీ మ్యూజియం, ఉద్యోగుల ఇళ్ల స్థలాలపై చంద్రబాబు సర్కారు బిల్డప్‌ 

వైఎస్‌ జగన్‌ హయాంలోనే మ్యూజియం నిర్మాణం ప్రతిపాదన, పనులు మొదలు 

2023లోనే ఈ విషయాన్ని టీటీడీ అధికారికంగా చెప్పింది 

వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంలోనే 85 శాతం పనులు పూర్తి 

అయినా ఈ ప్రభుత్వంలోనే మ్యూజియం నిర్మాణం జరిగినట్లు కలరింగ్‌ 

టీటీడీ ఉద్యోగులకు 2022లోనే భూసేకరణ 

వడమాలపేట మండలంలోని పాదిరేడు అరణ్యం వద్ద 300.22 ఎకరాల కేటాయింపు 

7 వేల మంది ఉద్యోగులకు స్థలాలు కేటాయించేలా ప్రణాళిక 

ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వమే కొత్తగా చేస్తున్నట్లుగా చెప్పుకోవడంపై విమర్శలు  

తిరుమల: తిరుమలలో అభివృద్ధి కార్యక్రమాల్లోనూ చంద్రబాబు ప్రభుత్వం క్రెడిట్‌ చోరీ చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది. గత ప్రభుత్వం చేపట్టి, అధిక భాగం పూర్తి చేసిన శ్రీ వేంకటేశ్వర మ్యూజియం ఆధునీకరణ, టీటీడీ ఉద్యోగుల ఇళ్ల స్థలాల వ్యవహారం మొత్తం చంద్రబాబు ప్రభుత్వంలో కొత్తగా చేసినట్లుగా బిల్డప్‌ ఇవ్వడంపట్ల భక్తులు, ఉద్యోగవర్గాల నుంచి విమర్శలు వస్తున్నాయి.  

మ్యూజియం పనులకు అప్పుడే శ్రీకారం 
శ్రీవారి ఆలయ చరిత్ర, కళా సంపదను భక్తులకు పరిచయం చేసేలా ఎస్వీ మ్యూజియాన్ని ఆధునిక సాంకేతికతతో అభివృద్ధి చేసే ప్రాజెక్టు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వ హయాంలోనే ప్రారంభమైంది. 2023లోనే టీటీడీ అధికారికంగా విడుదల చేసిన వివరాల ప్రకారం.. మ్యూజియం ఆధునీకరణకు టీసీఎస్‌ రూ.125 కోట్లు, బెంగళూరుకు చెందిన మ్యాప్‌ సిస్టమ్స్‌ రూ.20 కోట్లు విరాళంగా అందించేందుకు ముందుకొచ్చాయి. మొత్తం రూ.145 కోట్ల ప్రాజెక్టులో 19 గ్యాలరీలను అభివృద్ధి చేయనున్నట్లు అప్పట్లోనే టీటీడీ వెల్లడించింది. అన్నమయ్య రాగి రేకులు, శిల్పాలు, నాణేలు, ఆయుధాలు, సంగీత వాయిద్యాలు, పూజా సామగ్రి తదితర చారిత్రక వస్తువులను ప్రదర్శించేలా గ్యాలరీలను రూపొందించే పనులు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వ హయాంలోనే ప్రారంభమై, 85 శాతం పనులు కూడా పూర్తయ్యాయి. మిగిలిన 15 శాతం  పనులకు ప్రభుత్వం మారిన తర్వాత రెండేళ్ల సమయం పట్టింది. దీనిని విస్మరించి, మ్యూజియం అభివృద్ధి మొత్తం బాబు ప్రభుత్వంలోనే జరిగినట్లుగా చెప్పుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. 

ఉద్యోగుల ఇళ్ల స్థలాలపైనా అదే చర్చ 
టీటీడీ ఉద్యోగుల ఇళ్ల స్థలాల విషయంలోనూ చంద్రబాబు సర్కారు క్రెడిట్‌ కొట్టేసే ప్రయత్నం చేసింది. టీటీడీ అధికారిక రికార్డుల ప్రకారం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వ హయాంలో 2022లోనే వడమాలపేట మండలంలోని పాదిరేడు అరణ్యం వద్ద సుమారు 300.22 ఎకరాల భూమిని ఉద్యోగుల ఇళ్ల స్థలాల కోసం సేకరించారు. ఇందుకోసం రూ.61.63 కోట్ల చెక్కును జిల్లా కలెక్టర్‌కు అందించినట్లు టీటీడీ అప్పట్లోనే వెల్లడించింది. 2023 ఆగస్టులో అప్పటి టీటీడీ చైర్మన్‌ భూమన  కరుణాకర్‌రెడ్డి భూమిని కూడా పరిశీలించారు. సుమారు 7 వేల మంది ఉద్యోగులకు 35/55 అడుగుల చొప్పు
న స్థలాలు కేటాయించే ప్రణాళికను అప్పట్లోనే ప్రకటించారు. లేఅవుట్, కచ్చా రోడ్లు, టౌన్‌ ప్లానింగ్‌ అనుమతుల కోసం కూడా చర్యలు చేపట్టినట్లు టీటీడీ తెలిపింది. ఇప్పుడేదో కొత్తగా చేస్తున్నట్లుగా ఉద్యోగుల ఇళ్ల స్థలాల అభివృద్ధికి రూ.230 కోట్లతో మౌలిక వసతులు కలి్పస్తామని చంద్రబాబు 
ప్రకటించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement