సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం నుంచి పార్టీ ప్రధాన కార్యదర్శులు, రీజనల్ కో–ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. రాష్ట్రంలో కరువు, వర్షాభావ పరిస్థితులు, నీటి ఎద్దడికి సంబంధించి జిల్లాల వారీగా స్థానిక పరిణామాలపై వైఎస్ జగన్ చర్చించనున్నారు. క్షేత్రస్థాయిలో రైతులకు అండగా ఉండేలా చేపడుతున్న పార్టీ కార్యక్రమాలపై ఆయన మాట్లాడనున్నారు.


