ఎఫ్‌బీఐ పేరుతో ‘పోలీసింగ్‌’! | YSRCP President YS Jagan Fires On Chandrababu Red Book Govt | Sakshi
Sakshi News home page

ఎఫ్‌బీఐ పేరుతో ‘పోలీసింగ్‌’!

Sep 17 2026 5:14 AM | Updated on Sep 17 2026 5:14 AM

YSRCP President YS Jagan Fires On Chandrababu Red Book Govt

చంద్రబాబూ.. ఇదేనా మీ పరిపాలన?  

మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజం

బాబు ‘రెడ్‌బుక్‌ పాలన’ అంతర్జాతీయస్థాయికి చేరింది.. 

పోలీసులు అమెరికా దర్యాప్తు సంస్థ పేరును ఎందుకు వాడారు? 

ఇది రాష్ట్రంతో పాటు దేశ ప్రతిష్టను కూడా దిగజార్చే హేయమైన చర్య 

అసలు ఎక్స్‌కు అలా అభ్యర్థన పంపాలని ఆదేశించింది ఎవరు? 

మీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న గొంతులను అణచివేసేందుకే ఈ పని చేశారా? 

సోషల్‌ మీడియా యుగంలో వాస్తవాలను దాచి పెట్టడం సాధ్యం కాదు 

కరువుతో నష్టపోయిన రైతులను ఆదుకోండి.. యువతకు ఉద్యోగాలు కల్పించండి.. ప్రజల సమస్యలను పరిష్కరించండి

సాక్షి,అమరావతి: అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ (ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌) పేరును వాడి ఏపీ పోలీసులు తప్పుడు ఫిర్యా­దులు చేయడంపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో చంద్రబాబు ‘రెడ్‌ బుక్‌ పాలన’ అంతర్జాతీయ స్థాయికి చేరిందంటూ ధ్వజమెత్తారు. చంద్రబాబూ రాష్ట్రం పరువు తీయవద్దంటూ హితవు పలికారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్‌లో బుధవారం పోస్టు చేశారు. ఇందుకు సంబంధించిన కొన్ని ఆధారాలను సైతం ఆయన ట్యాగ్‌ చేశారు. ఆ పోస్టులో ఇంకా జగన్‌ ఏమన్నారంటే.. 

దేశ ప్రతిష్ఠను కూడా దిగజార్చే హేయమైన చర్య 
‘‘రాష్ట్ర పోలీసులు నకిలీ గుర్తింపుతో ఏకంగా అమెరికాకు చెందిన  ‘ఎఫ్‌బీఐ’  పేరును వాడుకుంటున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి నిజమైన ముప్పు. చంద్రబాబూ... మీ పాలనలో ఇదేనా పోలీసింగ్‌ అంటే?.  లేక రాజకీయ కక్ష సాధింపు కోసం ప్రభుత్వమే స్వయంగా చేస్తున్న వ్యవహారమా?. ‘ఎక్స్‌’లోని పోస్టులను తొలగించాలని కోరుతూ రాష్ట్ర పోలీసులు తమను అమెరికాకు చెందిన ‘ఎఫ్‌బీఐ’గా పేర్కొనడం అత్యంత దారుణం. ఇది మన రాష్ట్రంతో పాటు దేశ ప్రతిష్ఠను కూడా దిగజార్చే హేయమైన చర్య. ఆ మెయిల్‌ ఆంధ్రప్రదేశ్‌ పోలీసుల అధికారిక ఈ –మెయిల్‌ చిరునామా నుంచే వచి్చందని ‘ఎక్స్‌’ ధృవీకరించింది. ఆ మెయిల్‌ పంపిన సంబంధిత అధికారి తాను ‘ఎఫ్‌బీఐ’ సంస్థకు చెందిన వ్యక్తిగా చెప్పుకున్నారు. అసలు ఆ అభ్యర్థన పంపాలని ఆదేశించింది ఎవరు? అక్కడ ‘ఎఫ్‌బీఐ’ పేరు ఎందుకు దుర్వినియోగం చేశారు? మీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న గొంతులను అణచివేసేందుకు, ‘ఎక్స్‌’ను తప్పుదోవ పట్టించేందుకు ఉద్దేశపూర్వకంగానే ఈ పని చేశారా? 

మీ రాజకీయ సెన్సార్‌íÙప్‌ను అమలు చేయడానికా పోలీసు యూనిఫాం? 
పోలీసు యూనిఫాం అనేది చట్టాన్ని పరిరక్షించడానికి ఉద్దేశించింది. అంతేగానీ మీ రాజకీయ సెన్సార్‌íÙప్‌ను అమలు చేయడానికి కాదు. రాజకీయ ప్రయోజనాల కోసం చేపట్టిన పోస్టుల తొలగింపు చర్యలో ఒక విదేశీ దర్యాప్తు సంస్థ పేరును వాడటం ఆంధ్రప్రదేశ్‌కు అవమానం. దీని వల్ల రాష్ట్ర పోలీసు వ్యవస్థ విశ్వసనీయత తీవ్రంగా దెబ్బ తింది.  

సోషల్‌ మీడియా యుగంలో వాస్తవాలను దాచి పెట్టలేరు.. 
అమలు చేయని సూపర్‌ సిక్స్, సూపర్‌ సెవెన్‌ హామీలు, డీఎస్సీ కుంభకోణం, అమరావతి నిర్మాణంలో దోపిడీ, అప్పులు, పాలనా వైఫల్యాలు, వేధింపులు.. ఇదీ మీ పరిపాలన.. విమర్శకుల గొంతు నొక్కేందుకు ఉపయోగిస్తున్న మీ అధికారాన్ని, గత ఎన్నికల ముందు మీరు ఇచ్చిన సూపర్‌ సిక్స్, సూపర్‌ సెవెన్‌ హామీల అమలుకు వినియోగించండి. ఇంకా తీవ్ర కరువు పరిస్థితుల్లో మొత్తం నష్టపోయిన రెతులను ఆదుకోండి. యువతకు ఉద్యోగాలు కల్పించండి. రాష్ట్ర ప్రజల సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టండి. చాలా వేగంగా వ్యాప్తి చెందిన ఈ సామాజిక మాధ్యమాల యుగంలో వాస్తవాలను దాచి పెట్టడం సాధ్యం కాదు. మీ పనితీరుపై  మీ ప్రభుత్వానికి అంత నమ్మకం ఉంటే, ప్రజలకు అంతా బాగా చేశామని అనుకుంటే.. అది మీ పనితీరులో చూపాలి. ఆ ప్రక్రియలో పూర్తి పారదర్శకంగా ఉండాలి. అంతేతప్ప, ఇలా సెన్సార్‌íÙప్, వేధింపులతో కాదు’’ అని వైఎస్‌ జగన్‌ ఎక్స్‌లో తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement