రేపు వైఎస్సార్‌సీపీ ముఖ్య నేతలతో వైఎస్‌ జగన్‌ వీడియో కాన్ఫరెన్స్ | YS Jagan to Hold Video Conference with YSRCP Leaders | Sakshi
Sakshi News home page

రేపు వైఎస్సార్‌సీపీ ముఖ్య నేతలతో వైఎస్‌ జగన్‌ వీడియో కాన్ఫరెన్స్

Sep 16 2026 8:50 PM | Updated on Sep 16 2026 8:53 PM

YS Jagan to Hold Video Conference with YSRCP Leaders

సాక్షి,తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి రేపు (సెప్టెంబర్ 17, 2026) ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం నుంచి పార్టీ ప్రధాన కార్యదర్శులు, రీజనల్‌ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులతో కీలక వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.

ఈ సమావేశంలో రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత కరువు పరిస్థితులు, తీవ్రమైన నీటి ఎద్దడి, వర్షాభావ పరిస్థితులపై జిల్లాల వారీగా సమీక్షించనున్నారు. అలాగే ఆయా ప్రాంతాల్లోని స్థానిక పరిణామాలు, సమస్యలపై సీనియర్ నాయకులతో  వైఎస్‌ జగన్ విస్తృతంగా చర్చించనున్నారు. క్షేత్రస్థాయిలో రైతాంగానికి అండగా ఉండేలా పార్టీ కార్యక్రమాలపై ఆయన నాయకులతో మాట్లాడనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement