తిరుమల ప్రసాదంలో జంతువుల కొవ్వు కలవలేదు: ఈడీ | Animal fat was not mixed in Tirumala Prasadam: ED | Sakshi
Sakshi News home page

తిరుమల ప్రసాదంలో జంతువుల కొవ్వు కలవలేదు: ఈడీ

Sep 18 2026 10:02 PM | Updated on Sep 18 2026 10:25 PM

Animal fat was not mixed in Tirumala Prasadam: ED

తిరుమల  తిరుమల లడ్డూ ప్రసాదం అంశానికి సంబంధించి జంతువుల కొవ్వు కలిసిందని పదే పదే ఆరోపణలు చేస్తున్న కూటమి సర్కారుకు షాక్‌ తగిలింది. తిరుపతి దేవస్థానం శ్రీవారి లడ్డూ ప్రసాదంలో ఎటువంటి జంతువుల కొవ్వు కలవలేదని ఈడీ నిర్దారించింది.  శ్రీవారి ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందంటూ కూటమి ప్రభుత్వంలోని పెద్దలు, ముఖ్యమంత్రి చంద్రబాబు పదే పదే ఆరోపణలు చేస్తూ వచ్చారు. 

అయితే తిరుమల ప్రసాదంలో ఎటువంటి జంతువుల కొవ్వు కలవలేదని ఈడీ సైతం నిర్దారించిన నేపథ్యంలో కూటమి సర్కార్‌ కుట్ర పూరిత రాజకీయం మరోసారి నిరూపితమైంది. అంతకుముందు సీబీఐ నేతృత్వంలోని సిట్‌ కూడా తిరుమల ప్రసాదంలో ఎటువంటి జంతువుల కొవ్వు కలవలేదని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. 

ఈ సందర్బంలో భక్తులకు నిజంగా బాధ కలిగించిన వారు ఎట్టకేలకు క్షమాపణ చెబుతారా?, మీడియా సంస్థలు, రాజకీయ నాయకులు, వారి మద్దతుదారులు అందరూ క్షమాపణ చెబుతారా? అని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. గత రెండేళ్లుగా ఇదే  విషయాన్ని చెబుతూ వస్తున్నా తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రజల్ని, భక్తుల్ని పక్కదోవ పట్టించిన వారు క్షమాపణలు చెప్పాల్సిందేననే డిమాండ్‌  చేస్తున్నారు.

 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement