బ్యాండ్‌ శబ్దానికి ఆగిన యువకుడి గుండె | Young guy collapses to death while dancing at Ganesh idol | Sakshi
Sakshi News home page

బ్యాండ్‌ శబ్దానికి ఆగిన యువకుడి గుండె

Sep 25 2026 6:19 AM | Updated on Sep 25 2026 6:19 AM

Young guy collapses to death while dancing at Ganesh idol

వినాయక నిమజ్జనంలో డ్యాన్స్‌ చేస్తూ కుప్పకూలిన యువకుడు

జగిత్యాల క్రైం: జగిత్యాల పట్టణంలోని తులసీనగర్‌లో గురువారం రాత్రి వినాయక నిమజ్జన శోభాయాత్రలో భాగంగా డ్యాన్స్‌ చేస్తున్న ఓ యువకుడు బ్యాండ్‌ శబ్దం వల్ల గుండెపోటుతో మృతిచెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. తులసీనగర్‌కు చెందిన తోపారపు జయంత్‌ (24) వినాయక నిమజ్జనంలో భాగంగా తన ఇంటి ముందు మిత్రులతో కలిసి డ్యాన్స్‌ చేస్తున్నాడు.

 ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో స్పందించిన పోలీస్‌ సిబ్బంది యువకుడికి సీపీఆర్‌ చేశారు. 108 అంబులెన్స్‌ సకాలంలో రాకపోవడంతో పోలీస్‌ వాహనంలో ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement