గ్రామంలోకి ఏనుగుల గుంపు ప్రవేశించకుండా ఏఐ అలర్ట్ ఎలా సహాయపడిందో తెలిపే ఓ వీడియో వైరల్‌గా మారింది. అటవీ అధికారులు.. జంతువుల కదలికలను గుర్తించడానికి, మనుషులు- వన్యప్రాణులు మధ్య ప్రమాదకర ఘర్షణలు జరగకముందే వాటిని నివారించడానికి ఇది ఎంతగానో సహాయపడుతోంది. పశ్చిమ బెంగాల్‌లోని జల్దాపారా సమీపంలో ఇటీవల జరిగిన ఈ ఘటన.. ఏఐ ఆధారిత నిఘా కెమెరాలు, అటవీ సిబ్బంది తక్షణ చర్యల ద్వారా ఏనుగుల దాడిని ఎలా నివారించబడిందో చూపించింది.
ఐఎఫ్ఎస్ అధికారి పర్వీన్ కాస్వాన్ షేర్ చేసిన ఒక వీడియో.. ఏనుగుల కదలికలను పర్యవేక్షించడానికి, వన్యప్రాణుల నుంచి సమీప కమ్యూనిటీలను రక్షించడానికి ఏఐని గ్రౌండ్‌లో ఎలా ఉపయోగిస్తున్నారో ఈ వీడియో చెబుతుంది. ఈ సంఘటన రాత్రి సుమారు 12:32 గంటలకు జరిగింది. అప్పుడు ఏఐ-ఎనేబుల్డ్ నిఘా కెమెరాలు అటవీ సరిహద్దు నుండి సమీప గ్రామం వైపు కదులుతున్న ఏనుగుల గుంపును గుర్తించాయి. ఈ సిస్టమ్ వెంటనే కదలికలను గుర్తించి.. డివిజన్ కంట్రోల్ రూమ్‌కు ఆటోమేటిక్ అలర్ట్‌ను పంపింది.
15 నిమిషాల్లోపే సమీపంలోని రాపిడ్ రెస్పాన్స్ టీమ్ అక్కడికి చేరుకుని ఏనుగుల కదలికలను పర్యవేక్షించి.. అవి గ్రామంలోకి ప్రవేశించకుండా సురక్షితంగా అడ్డుకున్నాయి. దీంతో పెద్ద ప్రమాదమే తప్పింది. ఈ వీడియోలో చీకటిలో ఏనుగులు నెమ్మదిగా వెళ్లడం, నైట్ విజన్ నిఘా కెమెరాల ద్వారా వాటి కదలికలు స్పష్టంగా రికార్డు కావడం కనిపిస్తుంది. కొద్ది క్షణాల తర్వాత ఏఐ సిస్టమ్ గుంపును గుర్తించి ఆటోమేటిక్‌గా అలర్ట్‌ను ట్రిగ్గర్ చేస్తుంది. దీనివల్ల జంతువులు మానవ ఆవాసాలను చేరుకోకముందే అధికారులు స్పందించడానికి వీలవుతుంది.
At 12:32 AM in night, our AI-enabled surveillance cameras detected a herd of elephants moving from the forest boundary towards a nearby village.
The alert was instantly relayed to the Division Control Room, and within 15 minutes, nearby stationed rapid response team reached the… pic.twitter.com/BGFiNMmicO— Parveen Kaswan, IFS (@ParveenKaswan) July 28, 2026
సోషల్ మీడియాలో ఈ క్లిప్ వైరల్ అయింది. వన్యప్రాణి సంరక్షణలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగాన్ని చాలా మంది వినియోగదారులు ప్రశంసించారు. ప్రజల భద్రతకు, పర్యావరణ పరిరక్షణకు ఏఐని ఏ విధంగా ఉపయోగించవచ్చో ఈ టెక్నాలజీ ఒక ఆచరణాత్మక ఉదాహరణ అంటూ కొనియాడారు. ఇలాంటి పరిస్థితులను నిర్వహించడానికి రాత్రింబవళ్ళు కష్టపడుతున్న అటవీ సిబ్బందిని కూడా అభినందించారు. ఒక యూజర్ స్పందిస్తూ.. ‘ఇది చాలా బాగుంది.. ఏఐని సరిగ్గా ఉపయోగించడం చాలా ప్రయోజనాలు పొందవచ్చన్నారు.


