కోడ్ కూసింది.. ఫ్లెక్సీ తొలగింది
మున్సిపల్ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించడంతో మోడల్ కోడ్ తక్షణమే అమల్లోకి వచ్చింది. ఈ మేరకు బల్దియా సిబ్బంది రంగంలోకి దిగారు. పట్టణంలోని ప్రధానచౌక్‌లతో పాటు పలు కాలనీల్లో ఆయా రాజకీయ పార్టీల నేతలు, కార్యకర్తలు ఏర్పాటు చేసిన ప్రచార ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లను తొలగించి వేశారు. కూడళ్లలో గల దివంగత రాజకీయ నాయకుల విగ్రహాలను ముసుగుతో కప్పివేశారు. స్థానిక ఎన్టీఆర్ చౌరస్తా వద్ద రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన హీలియం బెలూన్‌పై సీఎం, డిప్యూటీ సీఎం చిత్రాలు ఉండడంతో ఆ బెలూన్‌ను సైతం తొలగించేశారు.
– కై లాస్‌నగర్/సాక్షి ఫొటోగ్రాఫర్,ఆదిలాబాద్
కోడ్ కూసింది.. ఫ్లెక్సీ తొలగింది


