ఎన్నికల షెడ్యూల్
మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల నేటి నుంచే నామినేషన్ల స్వీకరణ ‘కోడ్’ తక్షణం అమల్లోకి.. హీటెక్కిన ‘పుర’ రాజకీయం ఫిబ్రవరి 16న చైర్‌పర్సన్ ఎన్నిక
సాక్షి,ఆదిలాబాద్: మున్సిపల్ ఎన్నికల నగారా మో గింది. ఎన్నికల కమిషన్ షెడ్యూల్‌ను విడుదల చే సింది. గతంలో మాదిరే పరోక్ష పద్ధతిలో ఎన్నికలు జరగనున్నాయి. ఒకే విడతలో వీటన్నింటిని పూర్తి చేయనున్నారు. వార్డుల్లో కౌన్సిలర్లను ఎన్నుకున్న తర్వాత వారి ద్వారా ఫిబ్రవరి 16న చైర్ ప ర్సన్ ఎన్నిక నిర్వహించనున్నారు. మొత్తం 20 రోజుల్లో ప్రక్రియ ముగియనుంది. బుధవారం నుంచే నామినేషన్ల స్వీకరణ ఘట్టం మొదలు కానుంది. దీంతో ఒక్కసారిగా మున్సిపల్‌లో రాజకీయం
వేడెక్కింది.
టీటీడీసీలో నామినేషన్ల స్వీకరణ..
జిల్లా కేంద్రంలోని సాంకేతిక శిక్షణ, అభివృద్ధి కేంద్రం (టీటీడీసీ)లో ఆయా వార్డుల అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. ఇందుకోసం అఽ దికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రతీ మూ డు వార్డులకు ఒక ఆర్‌వో చొప్పున 17 కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. నామినేషన్ల దాఖలులో ఏమైనా అనుమానాలు ఉంటే నివృత్తి కోసం హెల్ప్ డె స్క్ అందుబాటులో ఉంచుతున్నారు. ఇదిలా ఉంటే ఎన్నికల సామగ్రి పంపిణీ, ఓట్ల లెక్కింపు కూడా టీ టీడీసీలోనే నిర్వహించనున్నా రు. మరోవైపు సిబ్బందికి ఇ ప్పటికే శిక్షణ నిర్వహించారు.
‘కోడ్’ అమల్లోకి..
మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలతోనే మోడల్ కోడ్ అమలులోకి వచ్చినట్లు ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. ఇది పట్టణ పరిధికి వర్తిస్తుంది. మున్సిపల్ యాక్ట్ 2019, బీఎన్‌ఎస్ ప్రకారం ఎన్నికల నిబంధనలు అమలు చేస్తున్నారు. ఎవరైనా రూ.50వేల నగదు వరకు తీసుకెళ్లవచ్చని, అంతకుమించి ఉంటే దానికి సంబంధించి సమాధానం చెప్పాల్సి ఉంటుందని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. కోడ్ రాకతో పట్టణ పరిధిలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు బ్రేక్ పడనుంది. అలాగే సంక్షేమ పథకాల అమలు సైతం నిలిచిపోనుంది.
నోటిఫికేషన్ విడుదల, నామినేషన్ల స్వీకరణ షురూ జనవరి 28 (బుధవారం)
నామినేషన్ల స్వీకరణకు తుది గడువు జనవరి 30 (శుక్రవారం)
పరిశీలన జనవరి 31 (శనివారం)
స్క్రూటినీ తర్వాత అర్హులైన అభ్యర్థుల ప్రకటన జనవరి 31 (శనివారం)
అభ్యంతరాల స్వీకరణ ఫిబ్రవరి 1 సాయంత్రం 5 వరకు పరిష్కారం ఫిబ్రవరి 2 సాయంత్రం 5 వరకు నామినేషన్ల ఉపసంహరణ ఫిబ్రవరి 3 మధ్యాహ్నం 3 వరకు బరిలో నిలిచే అభ్యర్థుల ప్రకటన ఫిబ్రవరి 3 మధ్యాహ్నం 3 తర్వాత
పోలింగ్ ఫిబ్రవరి 11 ఉదయం 7 నుంచి
సాయంత్రం 5 గంటల వరకు
రీపోలింగ్ (ఎక్కడైనా అవసరం పడితే) ఫిబ్రవరి 12
ఓట్ల లెక్కింపు ఫిబ్రవరి 13 ఉదయం 8 గంటల నుంచి..
రిజర్వేషన్ వివరాలు..
మొత్తం వార్డులు : 49
ఎస్టీ : 03
ఎస్సీ : 06
బీసీ : 15
మహిళ (జనరల్) : 13
అన్ రిజర్వుడ్ : 12
పోలింగ్ సంబంధిత వివరాలు..
బ్యాలెట్ బాక్సులు : 312 (అదనంగా 20 శాతం కలుపుకొని)
రిటర్నింగ్ ఆఫీసర్లు : 20 (అదనంగా 20 శాతం కలుపుకొని)
అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లు : 96 (అదనంగా 20 శాతం కలుపుకొని)
జోనల్ ఆఫీసర్లు : 15
ఫ్లయింగ్ స్క్వాడ్ : 12
ఎస్‌ఎస్‌టీఎస్ : 12
ప్రిసైడింగ్ ఆఫీసర్లు : 220 (అదనంగా 20 శాతం కలుపుకొని)
ఓపీవోలు : 792 (అదనంగా 20 శాతం కలుపుకొని)
పోలీస్ సిబ్బంది : 250 (అధికారులు కలుపుకొని)
ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలో..
మొత్తం ఓటర్లు 1,43,655
పురుషులు 69,813
మహిళలు 73,816
ఇతరులు 06


