‘బీజేపీకి అవకాశమిస్తే నిజాయితీ పాలన’
కై లాస్‌నగర్: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి అవకాశమిస్తే విలువలతో కూడిన నిజాయితీ గల పాలన అందిస్తామని ఎమ్మెల్యే పాయల్ శంకర్ హామీ ఇచ్చారు. శుక్రవారం బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థుల నామినేషన్ల దాఖలు కార్యక్రమానికి ఎంపీ గోడం నగేశ్‌తో కలిసి హాజరయ్యారు. పార్టీ తరఫున ఎన్నికల అధికారులకు ఏ–ఫామ్‌లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆదిలా బాద్‌లో ఆర్‌యూబీ, ఆర్వోబీ, ఎయిర్ పోర్టు మంజూరు చేయించడంతో పాటు రూ.300 కోట్లతో అమృత్ పథకం కింద తాగునీటి పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మానంద్ తదితరులు పాల్గొన్నారు.
పోలీసులతో స్వల్ప వాగ్వాదం
ఎంపీ గోడం నగేశ్, ఎమ్మెల్యే పాయల్ శంకర్‌తో పా టు కౌన్సిలర్ అభ్యర్థులు పార్టీ కండువాలు ధరించి నామినేషన్ వేయడానికి కేంద్రంలోకి వెళ్లేందుకు ప్ర యత్నించారు. గేటు వద్దనున్న పోలీసులు వీరిని ఆ పి కండువాలు తీసి వెళ్లాలని సూచించారు. ఈ విషయంలో ఇరువర్గాల మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. చివరకు వారు పార్టీ కండువాలు తీసివే సి కేంద్రంలోకి వెళ్లారు. అనంతరం ఎమ్మెల్యే మా ట్లాడుతూ.. పార్టీ పరంగా నిర్వహించే ఎన్నికల నా మినేషన్ సమయంలో కండువాలు తీసి వేయడమెందుకని ప్రశ్నించారు. ఈ విషయాన్ని రాష్ట్ర ఎన్ని కల సంఘం దృష్టికి తీసుకెళ్తామని పేర్కొన్నారు.
పార్టీ అభ్యర్థులతో వస్తున్న ఎంపీ నగేశ్, ఎమ్మెల్యే శంకర్


