ఖానాపూర్ చెరువు.. కబ్జా
గతంలో పట్టణంలోని పలు కాలనీల దాహార్తితో పాటు సాగునీటిని అందించిన ఖానాపూర్ చెరువు క్రమంగా కాలుష్యకాసారంగా మారింది. మురుగునీరంతా అందులోకి చేరడం, గుర్రపు డెక్కతో నిండడంతో ఉనికి సైతం కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. మరోవైపు పెరుగుతున్న ఆక్రమణలతో చెరువు విస్తీర్ణం క్రమంగా తగ్గుతోంది. గుర్రపు డెక్క కారణంగా మత్స్యకారుల ఉపాధికి విఘాతం ఏర్పడుతోంది. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఈ చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా మార్చాలని సంకల్పించింది. ఇందుకోసం రూ.2.50 కోట్ల నిధులు కేటాయించింది. రూ.కోటిన్నర వరకు ఖర్చు చేసినా ఎలాంటి అభివృద్ధికి నోచుకోకపోవడం గమనార్హం.
ఖానాపూర్ చెరువు.. కబ్జా


