బాధితులకు అండగా ఉండాలి
ఆదిలాబాద్‌టౌన్: బాధితులకు ఎల్లవేళలా అండగా ఉండాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నా రు. జిల్లా పోలీసు ముఖ్య కార్యాలయంలో సో మవారం ప్రజా ఫిర్యాదుల కార్యక్రమం నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన వారి ద్వారా 13 ఫిర్యాదులను నేరుగా స్వీకరించారు. బాధితులు తమ సమస్యలను వివరించగా, వాటిపై స్పందించిన ఎస్పీ వెంటనే సంబంధిత పోలీసు అధికారులకు ఫోన్ ద్వారా ఆదేశాలు జారీ చేశారు. ప్రజా సమస్యలపై బాధ్యతాయుతంగా వ్యవహరించి, త్వరితగతిన పరి ష్కరించి న్యాయం చేయాలని సూచించారు. కార్యక్రమంలో సీసీ కొండ రాజు, కవిత, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


