లేబర్ కోడ్‌లు రద్దు చేయాలి
ఆదిలాబాద్‌టౌన్: కార్మిక చట్టాల స్థానంలో కేంద్రం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పి.జయలక్ష్మి డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని యూనియన్ కార్యాలయంలో సోమవారం జిల్లా సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ ప్రజా, కార్మిక వ్యతిరేక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈనెల 12న నిర్వహించనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జయప్రదం చేయాలని కోరారు. అనంతరం సమ్మెకు సంబంధించిన బుక్‌లెట్లను ఆవిష్కరించారు. సమావేశంలో యూనియన్ జిల్లా అధ్యక్షుడు బొజ్జ ఆశన్న, ఉపాధ్యక్షులు డి.వెంకటమ్మ, ఎస్.నవీన్ కుమార్, ఎం.గంగన్న, సహాయ కార్యదర్శులు ఆర్.సురేందర్, నగేష్, పోచన్న, సుజాత తదితరులు పాల్గొన్నారు.


