పార్కింగ్.. పరేషాన్
పట్టణంలోని పురాతన కాలనీ అయిన అశోక్ రోడ్‌లో వెళ్లాలంటే జనం జంకుతున్న పరిస్థితి. వినాయక్ నుంచి తిర్పెల్లి వరకు గల ఈ రోడ్డు గతంలో ప్రధాన రోడ్డుగా ఉండేది. కాల క్రమేణ ఇరుకుగా మారింది. ఈ రహదారిని విస్తరించాలని ఏళ్లుగా డిమాండ్ వినిపిస్తున్నా అమలులోకి రావడం లేదు. 10 ఫీట్లతో కూడిన ఈ రోడ్డుపై ఒక వాహనం వెళ్లాలంటే మరో వాహనం ఆగాల్సిన దుస్థితి. బంగారు దుకాణాలు ఉండడంతో నిత్యం రద్దీ అధికం. భారీ వాహనాలు వస్తే ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోతోంది. అత్యవసర సమయాల్లో అంబులెన్స్ సైతం ఈ మార్గం గుండా వెళ్లలేని పరిస్థితి.


