రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక
దండేపల్లి: ఉమ్మడి జిల్లా వాలీబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇటీవల మంచిర్యాలలో నిర్వహించిన సబ్ జూనియర్ వాలీబాల్ ఎంపిక పో టీల్లో దండేపల్లి మండలం రెబ్బనపల్లి జెడ్పీ ఉ న్నత పాఠశాల విద్యార్థులు వినయ్, అక్షిత, ప్ర సన్న అత్యంత ప్రతిభ కనబర్చి రాష్ట్రస్థాయికి ఎంపికై నట్లు ఎంఈవో, పాఠశాల హెచ్‌ఎం మంత్రి రాజు తెలిపారు. ఈ నెల 5 నుంచి ని జామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లిలో జరిగే పోటీల్లో పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు. సదరు వి ద్యార్థులను ఉపాధ్యాయులు అభినందించారు.
కోలిండియా హాకీ పోటీలకు ఎంపిక
శ్రీరాంపూర్: కోలిండియా హాకీ పోటీలకు ఎంపికై న సింగరేణి జట్టులో శ్రీరాంపూర్ క్రీడాకారులకు చోటు దక్కింది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బి లాస్‌పూర్‌లో ఈ నెల 4, 5 తేదీల్లో జరుగనున్న కోలిండియా హాకీ పోటీలకు ఎస్సార్పీ ఓసీపీకి చెందిన ఈపీ ఆపరేటర్ తోట సురేశ్, సెక్యూరిటీగార్డులు ఈర్ల సదయ్య, అగ్గి నాగరాజు, జీ నరేందర్ (కోల్ కట్టర్, ఆర్కే 7), బెల్లం తిరుపతి (జనరల్ అసిస్టెంట్, ఎస్సార్పీ ఓసీపీ), జీ. శ్రీకాంత్(ఎంవీ డ్రైవర్, ఐకే ఓసీపీ), ఎల్.రాజేశ్(కోల్ కట్టర్, ఆర్కే 7) ఎంపికయ్యారు.
రైల్వేస్టేషన్‌లో మైనర్ బాలిక గుర్తింపు
ఆదిలాబాద్: ఆదిలాబాద్ రైల్వే స్టేషన్‌లో పదిహేనేళ్ల మైనర్ బాలికను జీఆర్‌పీ పోలీసులు బుధవారం గుర్తించారు. మధ్యాహ్నం సమయంలో రైల్వే స్టేషన్ ప్రాంగణంలో తిరుగుతున్న బాలికను పోలీసులు గుర్తించి వివరాలు అడగగా హైదరాబాద్‌లోని సురారం, గండిమైసమ్మ ప్రాంతానికి చెందినట్లుగా గుర్తించారు. అనంతరం పునరావాసం కోసం జిల్లా చైల్డ్ హెల్ప్‌లైన్ అధికారులకు అప్పగించినట్లు తెలి పారు. బాలికను గుర్తించిన జీఆర్‌పీ పోలీసులు టి.ప్రభాకర్, భగవాండ్లు, కె.ప్రవీణ్ కుమార్‌ను పలువురు రైల్వే సిబ్బంది అభినందించారు.
కోతుల దాడిలో మహిళకు గాయాలు
బాసర: బాసర ఆలయంలో ఎన్‌ఎంఆర్‌గా విధులు నిర్వహిస్తున్న గోదావరిపై బుధవారం కోతులు దాడి చేశాయి. ఆలయ పరిసరాలు శుభ్రం చేస్తుండగా ఒక్కసారిగా కోతులు దాడి చేయడంతో సదరు మహిళకు గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం బాసర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా సదరు మహిళపై కోతులు దాడి చేయడం ఇది రెండోసారి. ఆలయ పరిసరాల్లోంచి కోతులను తరలించాలని గ్రామస్తులు, భక్తులు కోరుతున్నారు.
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక


