రహదారి భద్రత అందరి బాధ్యత
ఆదిలాబాద్: రోడ్డు భద్రత అందరి బాధ్యత అని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో శనివారం నిర్వహించిన జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా పట్టణంలో 2కే రన్ నిర్వహించా రు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ రహదారి భద్రతా నియమాలు పాటించాలని సూచించారు. విధిగా హెల్మెట్ ధరించడంతో పాటు అతివేగాన్ని నియంత్రిస్తే ప్రాణనష్టాన్ని సైతం నివారించవచ్చన్నారు. నెల రోజులపాటు రవాణా శాఖ చేపట్టిన అవగా హన కార్యక్రమాలు ప్రశంసనీయమని కొనియాడా రు. అనంతరం టూ కే రన్‌లో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు, జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాజేశ్వర్, డీటీసీ రవీందర్ కుమార్, డీవైఎస్‌వో శ్రీనివాస్, డీఎంహెచ్‌వో నరేందర్ రాథోడ్, జిల్లా రవాణా అధికారి శ్రీనివాస్, ట్రావెల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రమోద్‌కుమార్ కత్రి తదితరులు పాల్గొన్నారు.


