రెండోరోజు 141నామినేషన్లు
● కేంద్రం వద్ద కోలాహలం
కైలాస్‌నగర్: మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల స్వీ కరణ ప్రక్రియ నిర్వహించే ఆదిలాబాద్ పట్టణంలోని టీటీడీసీ గురువారం కోలాహలంగా మారింది. సమయం ఎక్కువగా లేకపోవడంతో రెండోరో జు అభ్యర్థులు పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు చేశారు. మొదటిరోజు ఎనిమిది నామినేషన్లు మా త్రమే అందగా రెండోరోజు భారీగా దాఖలయ్యా యి. ప్రధాన రాజకీయ పార్టీల తరఫున టికెట్లు ఆ శిస్తూ అధికసంఖ్యలో అభ్యర్థులు నామినేషన్లు వే శారు. ఆదిలాబాద్ పట్టణంలోని 49వార్డులకు గాను 134మంది అభ్యర్థులు 141నామినేషన్లు దా ఖలు చేశారు. ఇందులో అత్యధికంగా కాంగ్రెస్ త రఫున 65రాగా, బీఆర్‌ఎస్ తరఫున 35, బీజేపీ త రఫున 26, ఏఐఎంఐఎం తరఫున రెండు, ఇతర గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల తరఫున 13 నామినేషన్లు అందాయి. మరో ఎనిమిది మంది ఇండిపెండెంట్లు నామినేషన్లు దాఖలు చేశారు. మొత్తంగా రెండ్రోజుల్లో 149నామినేషన్లు అందిన ట్లు మున్సిపల్ కమిషనర్ రాజు తెలిపారు. నామి నేషన్లు వేసే అభ్యర్థులతో పాటు వారి వెంట వచ్చి న మద్దతుదారులు, నామినేషన్ పత్రాలు పొందేందుకు వచ్చిన వారితో కేంద్రం వద్ద కోలాహల వాతావరణం ఏర్పడింది. కాగా, నామినేషన్ల స్వీకరణకు శుక్రవారంతో తెరపడనుంది. చివరిరోజు కావడంతో మరింతమంది అభ్యర్థులు నామినేష న్లు వేసే అవకాశముంది. ఈ ప్రక్రియ అడిషనల్ కలెక్టర్లు శ్యామలాదేవి, రాజేశ్వర్ పర్యవేక్షించారు.


