వాతావరణం | - | Sakshi
Sakshi News home page

వాతావరణం

Feb 5 2026 7:28 AM | Updated on Feb 5 2026 7:28 AM

వాతావరణం

వాతావరణం

వాతావరణం ● 7వ వార్డులో అత్యధికంగా 14 మంది ● 12, 20వ వార్డుల్లో ముగ్గురేసి చొప్పున బరిలో.. ● బీసీ జనరల్‌కు రిజర్వ్‌ అయిన 7వ వార్డు కేఆర్‌కే కాలనీలో కాంగ్రెస్‌, బీజేపీ, బీఆర్‌ఎస్‌, ఎంఐఎం వంటి ప్రధాన పార్టీలతో పాటు బీఎస్పీ, జనసేన, ఏఐఎఫ్‌బీ తరఫున ఏడుగురు బరిలో నిలువగా, వారికి పోటీగా మరో ఏడుగురు స్వతంత్రులుగా తలపడుతున్నారు. పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. ఈ వార్డులో మొత్తం 3,099 మంది ఓటర్లున్నారు. ● పట్టణంలోని న్యూ హౌసింగ్‌ బోర్డు కాలనీలో ఎస్టీ జనరల్‌గా రిజర్వ్‌ అయింది. 3,197మంది ఓటర్లు కలిగిన ఈ వార్డులో కేవలం ముగ్గురు మాత్రమే బరిలో నిలిచారు. బీఆర్‌ఎస్‌ ఇక్కడ పోటీలో లేకపోగా స్వతంత్ర అభ్యర్థికి మద్దతు ప్రకటించింది. గెలుపే లక్ష్యంగా ముగ్గురూ ప్రచారం సాగిస్తున్నారు. ● 20వ వార్డు తాటిగూడ, భాగ్యనగర్‌ బీసీ జనరల్‌కు రిజర్వ్‌ అయింది. ఇక్కడ బీజేపీ, బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ అభ్యర్థులు మాత్రమే పోటీలో నిలిచా రు. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచే వారు తమ ఎన్నికల ప్రచారాన్ని షురూ చేశారు. ఈ వార్డులో మొత్తం 2801 మంది ఓటర్లున్నారు. ● ఎస్టీ జనరల్‌గా రిజర్వ్‌ అయిన 14వ వార్డు సంజయ్‌నగర్‌లో నలుగురు మాత్రమే పోటీలో ఉ న్నారు. బీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌తో పాటు ఏఐఎఫ్‌బీ అభ్యర్థి బరిలో నిలిచారు. అలాగే 27వ వార్డు కోలిపూర జనరల్‌గా రిజర్వు అయ్యింది. ఈ వార్డులో మూడు ప్రధాన పార్టీలతో పాటు బీజేపీ రెబల్‌ అభ్యర్థితో కలిపి నలుగురు బరిలో నిలిచారు. 36వ వార్డు రవీంద్రనగర్‌లో మూడు ప్రధాన పార్టీలతోపాటు ఏఐఎఫ్‌బీ తరఫున మ రో అభ్యర్థి పోటీ చేస్తున్నారు. జనరల్‌ మహిళగా రిజర్వ్‌ అయిన 37వ వార్డులో ప్రధాన పార్టీలతో పాటు ఓ ఇండిపెండెంట్‌ కలిపి నలుగురు పోటీలో ఉన్నారు. బీసీ జనరల్‌ రిజర్వ్‌ అయిన 46వ వార్డు బ్రహ్మణవాడలో ప్రధాన పార్టీలతో పాటు ఒకరు ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్నారు. మిగతా వార్డుల్లో పోటీ బహుముఖంగా ఉంది.

వాతావరణం పొడిగా ఉంటుంది. గాలిలో తేమశాతం పెరగనుంది. వేకువజామున పొగమంచు ప్రభావం కనిపిస్తుంది.

బహుముఖ పోటీ

కై లాస్‌నగర్‌: మున్సి పల్‌ ఎన్నికల్లో భా గంగా పలు వార్డులో బహుముఖ పో టీ నెలకొంది. పట్ట ణంలోని 49 వార్డులకు గాను 314 మంది బరిలో నిలి చారు. ప్రధాన పార్టీ లైన బీజేపీ, కాంగ్రెస్‌ అన్ని వార్డుల్లో పోటీలో నిలువగా.. బీఆర్‌ఎస్‌ మాత్రం 12వ వార్డు మినహా అన్నిచోట్ల అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రజల వద్దకు వెళ్తున్నారు. ప్రతీ వార్డులో ఒకరిద్దరూ ఇండిపెండెంట్లు సైతం పోటీలో నిలిచారు. అత్యధికంగా 7వ వార్డు కేఆర్‌కే కాలనీలో 14 మంది బరిలో ఉన్నారు. పదో వార్డులో సరిగ్గా పది మంది పోటీ చేస్తున్నారు. 12వ వార్డు న్యూహౌసింగ్‌బోర్డు, 20వ వార్డు తాటిగూడలో త్రిముఖ పోటీ నెలకొంది. అన్ని వార్డుల్లోనూ ప్రచారపర్వం ఊపందుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement