ప్రజారంజక బడ్జెట్‌.. | - | Sakshi
Sakshi News home page

ప్రజారంజక బడ్జెట్‌..

Feb 2 2026 7:29 AM | Updated on Feb 2 2026 7:29 AM

ప్రజా

ప్రజారంజక బడ్జెట్‌..

కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించిన బడ్జెట్‌ ప్రజారంజకంగా ఉంది. అన్నివర్గాల ప్రజలను దృష్టిలో ఉంచుకొని కేటాయింపులు చేశారు. ప్రధానంగా విద్య, ఆరోగ్య రంగాల్లో ప్రయోజనం చేకూర్చేందుకు అధిక ప్రాధాన్యతనిచ్చారు. సామాన్యులకు అందుబాటులో ఉండేలా ఎలక్ట్రానిక్‌ వస్తువుల ధరలు తగ్గించడం ఊరటనిస్తుంది.

– గోడం నగేశ్‌, ఆదిలాబాద్‌ ఎంపీ

అంకెల గారెడీ..

కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ అంకెల గారెడీ తప్పా ఎలాంటి ప్రయోజనం లేదు. పేద, సామాన్య ప్రజలకు ఈ బడ్జెట్‌లో ఎలాంటి మేలు చేకూరలేదు. జిల్లాకు సంబంధించిన అభివృద్ధి, ప్రాజెక్టులకు నిధులు వస్తాయని భావించినప్పటికీ ఎలాంటి కేటాయింపులు చేయలేదు. ప్రతీ బడ్జెట్‌లోనూ విస్మరించడంతో ఈ ప్రాంత అభివృద్ధికి ఆటంకం ఏర్పడుతుంది.

– అనిల్‌ జాదవ్‌, బోథ్‌ ఎమ్మెల్యే

ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేలా..

కేంద్రం ప్రకటించిన వార్షిక బడ్జెట్‌ అన్నివర్గాల ప్రజల ఆమోదయోగ్యంగా ఉంది. రూరల్‌ డెవలప్‌మెంట్‌, మౌలిక వసతులు, సంక్షేమ

రంగాల కోసం ప్రత్యేక నిధులు కేటాయించడం హర్షణీయం. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడం, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేలా బడ్జెట్‌లో ప్రాధాన్యత ఇచ్చారు. రైతులు, దళిత, ఆదివాసీ సమూహాలకు సంక్షేమ ఫలాలు అందనున్నాయి. ప్రజల ఆకాంక్షను నెరవేర్చడం కోసం కేంద్రం కృషి చేస్తుందనడానికి ఈ బడ్జెట్‌ నిదర్శనం.

– పాయల్‌ శంకర్‌, ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే

ప్రజారంజక బడ్జెట్‌..
1
1/2

ప్రజారంజక బడ్జెట్‌..

ప్రజారంజక బడ్జెట్‌..
2
2/2

ప్రజారంజక బడ్జెట్‌..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement