విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
ఆదిలాబాద్‌టౌన్: విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని డీఎంహెచ్‌వో నరేందర్ రాథోడ్ హెచ్చరించారు. జిల్లా కేంద్రంలోని డీఎంహెచ్‌వో సమావేశ మందిరంలో వైద్య సిబ్బందితో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయాలని సూచించారు. వారు మందులు వాడుతున్నారా.. లేదా అనే విషయాన్ని పరిశీలించాలని అన్నారు. ఎవరైనా లక్ష్యాలను సాధించకపోతే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో ఎన్‌సీడీ ప్రోగ్రాం అధికారి శ్రీధర్, ఎన్‌హెచ్‌ఎం డీపీవో దేవిదాస్, వైద్యాధికారులు, ఏఎన్‌ఎంలు, సిబ్బంది పాల్గొన్నారు.


