అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవు
నార్నూర్: ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు విషయంలో అక్రమాలకు పాల్పడితే సహించే ది లేదని ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్ అ న్నారు. మండలకేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం ఏసీబీకి చిక్కిన హౌ సింగ్ ఏఈ శ్రీకాంత్ ఘటనపై బుధవారం ఆ యన విచారణ జరిపారు. అధికారులతో మా ట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులందరికీ అందేలా చూడాలన్నారు. సమన్వయంతో వ్యవహరిస్తూ నిబద్ధతతో పనిచేయాలని అధికారులకు సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారి స్తామన్నారు. నాసిరకంగా నిర్మిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయన వెంట తహసీల్దార్ జాడి రాజలింగు, ఎంపీడీవో పుల్లారావు, ఎంపీవో రమేష్, స్థానిక సర్పంచ్ కావేరి తదితరులున్నారు.


