నాడు ప్రెసిడెంట్.. నేడు చైర్‌పర్సన్
కై లాస్‌నగర్: ఆదిలాబాద్ మున్సిపాలిటీ 1952లో ఆవిర్భవించింది. సుమారు 46 ఏళ్ల పాటు గ్రేడ్–2గా ప్రజలకు సేవలందించగా 5.11.1998లో గ్రేడ్–1గా అప్‌గ్రేడ్ అయింది. తొలినాళ్లలో మున్సిపల్ అధ్యక్షుడి పదవీకి ఎన్నికలు నిర్వహించేవారు. 1952 నుంచి 1967 వరకు అధ్యక్షుడి పాలన కొనసాగగా ముగ్గురు పనిచేశారు. 1981 లో ఆ పదవీని చైర్‌పర్సన్‌గా మార్చారు. తొలి చైర్‌పర్సన్‌గా రంగనాథ్ బొల్లన్వార్ ఎన్నికయ్యా రు. ఈయన అధ్యక్షుడిగా కూడా సేవలందించారు. ఇప్పటి వరకు మొత్తం 14 మంది (ఇందులో ఇద్దరు రెండు పర్యాయాలు) పనిచేశారు. రంగినేని లక్ష్మణ్‌రావు రెండు సార్లు చైర్మన్‌గా కొనసాగారు. సాధారణ మున్సిపాలిటీగా ఉన్న సమయంలో కమిషనర్లు, ఆర్డీవోలు ప్రత్యేకాధికారులుగా బాధ్యతలు నిర్వహించారు. గ్రేడ్–1స్థాయికి అప్‌గ్రేడ్ అయ్యాక కలెక్టర్లు ప్రత్యేకాధికారులుగా పనిచేశారు. కాగా, ఆదిలాబాద్ బల్దియాలో చైర్మన్‌ల కంటే ప్రత్యేకాధికారుల పాలనే ఎక్కువగా ఉండటం గమనార్హం. మొత్తంగా 23 మంది (ఇందులో ముగ్గురు రెండు పర్యాయాలు) స్పెషలాఫీసర్లుగా కొనసాగారు. అధ్యక్షుడు, చైర్మన్‌గా పనిచేసిన ఘనతను రంగనాథ్‌రావు దక్కించుకున్నారు.
ప్రెసిడెంట్లుగా..
చైర్‌పర్సన్లుగా
ప్రత్యేక అధికారులుగా


