సమయం లేదు మిత్రమా..
కైలాస్‌నగర్: మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ బుధవారం మొదలైంది. దీంతో ఎన్ని కల బరిలో నిలవాలనుకునే అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసేందుకు ఆస్తి పన్ను బకాయిలేమి లేవని ధ్రువీకరణ సమర్పించాల్సి ఉంటుంది. వారిని ప్రతి పాదించే వారు కూడా బకాయిలేమి ఉండకూడదు. ఈ నేపథ్యంలో ఆస్తి, నల్లా బిల్లు బకాయిలు చెల్లించేందుకు అభ్యర్థులు మున్సిపల్ కార్యాలయానికి పరుగులు తీశారు. దీంతో బల్దియా కార్యాలయం కిటకిటలాడింది. సమయం ఎక్కువగా లేకపోవడంతో అభ్యర్థుల సంఖ్యకనుగుణంగా బల్దియా అధికా రులు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. సిబ్బందిని నియమించి బకాయిల వసూలు చేస్తున్నారు. ఏళ్లుగా పేరుకుపోయిన మొండి బకాయిలు సైతం వసూలు కానుండటంతో బల్దియా ఖజనాకు భారీ గా ఆదాయం చేకూరనుంది. నోడ్యూసర్టిఫికెట్ల జారీ కి అంతరాయం కలగకుండా చర్యలు తీసుకో వాల ని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు.


