అట్టహాసంగా క్రీడా సంబురం
బోథ్‌లో జిల్లాస్థాయి క్రీడా–సాంస్కృతిక పోటీలు షురూ హాజరైన కలెక్టర్ రాజర్షిషా, ఎస్పీ అఖిల్ మహాజన్, ఎమ్మెల్యే అనిల్ జాదవ్
బోథ్: జిల్లా స్థాయి బాలికల క్రీడా–సాంస్కృతిక సంబురం బుధవారం మొదలైంది. మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ప్రాంగణంలో వేడుకలను కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్, బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ము ఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ, క్రీడలు మానసిక వికాసానికి, క్రమశిక్షణకు దోహదపడతాయన్నారు. గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ లక్ష్య సాధన దిశగా సాగాలన్నారు. ఎస్పీ మాట్లాడుతూ, మైదానంలో కనబరిచే పట్టుదల జీవితంలో ఎదురయ్యే సవా ళ్లను ఎదుర్కోవడానికి తోడ్పడుతుందని అన్నా రు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో చది వే విద్యార్థినులే క్రీడల్లో అద్భుతమైన ప్రతిభ కనబరుస్తున్నారని ప్రశంసించారు. తెలంగాణ బిడ్డ నందిని అంతర్జాతీయ స్థాయిలో రాణించడం ఈ ప్రాంతానికి గర్వకారణమని పేర్కొన్నారు. క్రీడాకారుల కు అవసరమైన అన్ని రకాల వసతులు కల్పించేందుకు తాను సిద్ధంగా ఉన్నానన్నారు. ముందుగా విద్యార్థినుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నా యి. కార్యక్రమంలో ఐటీడీఏ పీవో యువరాజ్ మ ర్మాట్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లెపూల నర్స య్య, అదనపు కలెక్టర్లు శ్యామలాదేవి, రాజేశ్వర్‌తో పాటు పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
మూడు రోజుల పాటు..
క్రీడా, సాంస్కృతిక పోటీలు ఈనెల 30 వరకు మూ డు రోజుల పాటు కొనసాగనున్నాయి. జిల్లాలోని సాంఘిక, గిరిజన, బీసీ, మైనారిటీ సంక్షేమ గురుకులాలు, కేజీబీవీలు, ఆశ్రమ, ఆదర్శ పాఠశాలల వి ద్యార్థినులు 642 మంది పాల్గొంటున్నారు. క్రీడా వి భాగంలో కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, టెన్ని కాయి ట్, చదరంగం, క్యారమ్‌తోపాటు 100, 200, 400, 800 మీటర్ల పరుగు పందెం, షాట్‌పుట్, డిస్కస్ త్రో, లాంగ్‌జంప్, హైజంప్ పోటీలు నిర్వహిస్తున్నా రు. అలాగే బాలికల్లో దాగి ఉన్న కళాత్మక నైపుణ్యాలు వెలికితీసేందుకు సాంస్కతిక పోటీలు కూ డా ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా నృత్యం, పాటలు, ఫ్యాన్సీ డ్రెస్, స్కిట్ వంటి ప్రదర్శనలు ప్రే క్షకులను అలరిస్తున్నాయి. క్రీడాకారులు ఏర్పా టు చేసిన స్టాళ్లు, వివిధ చిత్ర రూపాలు ఆకట్టుకున్నా యి. బుధవారం నిర్వహించిన పోటీల్లో గెలు పొందిన క్రీడాకారులకు అతిథుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఆయా పాఠశాలల విద్యార్థినలు పాల్గొన్నారు.
ఆదివాసీ వేషధారణలో కలెక్టర్
సాయంత్రం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో కలెక్టర్ రాజర్షి షా పాల్గొన్నారు. గుస్సాడీ బృందంతో కలిసి స్టెప్పేయడం ఆకట్టుకుంది.


