పెన్‌గంగ తీరంలో అధికారుల తనిఖీలు
కై లాస్‌నగర్: తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దులో గ ల పెన్‌గంగ నదిలో ఇసుక అక్రమ తవ్వకాల తీరు ను వివరిస్తూ ‘ఇసుకాసురులు’ శీర్షికన ‘సాక్షి’లో బు ధవారం కథనం ప్రచురితమైంది. ఈ మేరకు జిల్లా ఉన్నతాధికారులు స్పందిస్తూ చర్యలకు ఆదేశించా రు. దీంతో బేల తహసీల్దార్ కోట్నాక్ రఘునాథ్‌రా వు పోలీసులతో కలిసి మండలంలోని కాంగార్‌పూర్ శివారులోని ఇసుక తవ్వకాలు జరిగే ప్రాంతా న్ని పరిశీలించారు. విషయం ముందే తెలుసుకున్న అక్రమార్కులు జేసీబీ, టిప్పర్లను అక్కడి నుంచి తరలించి తప్పించుకున్నారు. నదిలో ఇసుక నింపుతున్న ఆరు ట్రాక్టర్లను పరిశీలించగా వాటికి అధికా రిక టోకెన్లు ఉన్నట్లుగా తహసీల్దార్ తెలిపారు. అక్రమంగా ఇసుక తవ్వకాలు జరిపితే బాధ్యులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. కాగా జైనథ్ మండలం బహదుర్‌పురా (ఆనంద్‌పూర్)లోని ఇసుక త వ్వకాల ప్రాంతాన్ని జైనథ్ సీఐ శ్రావణ్ కుమార్, ఎస్సై గౌతమ్ పవార్ సందర్శించారు. ఇసుక తవ్వకాలకు ఉపయోగిస్తున్న బోటుతో పాటు జేసీబీని సీ జ్ చేసి స్టేషన్‌కు తరలించారు. బాధ్యులపై కేసు న మోదు చేసినట్లుగా తెలిపారు. నదితీరంతో పాటు జిల్లాలోని పలు మండలాల్లోనూ అధికారులు తనిఖీ లు నిర్వహించారు. సిరికొండ మండలంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న పలు ట్రాక్టర్లను స్వాఽ దీనం చేసుకున్నారు. అనుమతికి సంబంధించి వివరా లపై ఆరా తీసిన అధికారులు ట్రాక్టర్ డ్రైవర్ ఇచ్చిన పత్రాలు చూసి విస్తుపోయారు. అందులో తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీ చేసి ఈ అక్రమదందాకు పాల్పడినట్లు గుర్తించారు. బాధ్యులైన ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లుగా స్థానిక పోలీసులు తెలిపారు.
పెన్‌గంగ తీరంలో అధికారుల తనిఖీలు
పెన్‌గంగ తీరంలో అధికారుల తనిఖీలు


