జిల్లాకు చేరుకున్న ఎన్నికల పరిశీలకులు
కై లాస్‌నగర్: మున్సిపల్ ఎన్నికల కోసం ఎస్‌ఈ సీ పరిశీలకులను నియమించింది. సాధారణ పరిశీలకులుగా డి.హన్మంతునాయక్, వ్యయ పరిశీలకులుగా ఎల్.విజయ బుధవారం జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. వారికి అధికారులు పూలమొక్కలు అందజేసి స్వాగతం పలికారు. అనంతరం కలెక్టరేట్‌లోని సమాచార శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎన్నికల మీడి యా సెంటర్‌ను కలెక్టర్ రాజర్షిషా పరిశీలకులతో కలిసి ప్రారంభించారు.కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాజేశ్వర్, డీపీఆర్వో విష్ణువర్ధన్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం సదరు అధికారులు టీటీడీసీలోని నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించారు.


