గొడవలో ఇద్దరికి గాయాలు
లక్ష్మణచాంద: వైన్స్ షాపు వద్ద జరిగిన గొడవలో ఇద్దరికి గాయాలయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి..మండలంలోని రాచాపూర్‌కు చెందిన జడ రజినీకాంత్ (27) గురువారం మధ్యాహ్నం పని ని మిత్తం కనకాపూర్‌కు వెళ్లి ఇంటికి వస్తున్నాడు. ఈక్రమంలో కనకాపూర్ వైన్స్ షాపు వద్ద ఆగాడు. అదే సమయంలో రాచాపూర్‌కు చెందిన తక్కల సాయికుమార్..రజినీకాంత్ వద్దకు వెళ్లి తనకు మద్యం తాగించాలని కోరాడు. తన వద్ద డబ్బులు లేవని బదులిచ్చాడు. రజినీకాంత్ పేరున స్టఫ్‌ను సాయికుమార్ తీసుకోవడంతో ఎందుకు తీసుకున్నావని అడిగాడు. ఆగ్రహించి అక్కడ ఉన్న ఖాళీసీసాతో రజినీకాంత్‌పై దాడి చేశాడు. ఈక్రమంలో ఒకరికొకరు దాడి చేసుకున్నారు. రజినీ కాంత్‌కు తీవ్రగాయాలయ్యా యి. గ్రామస్తులు ఇచ్చిన సమాచారంతో అంబులెన్స్ సిబ్బంది అక్కడికి చేరుకుని ప్రథమ చికిత్స చేశారు. ఆ ఇద్దరిని నిర్మల్ ఏరియాస్పత్రికి తరలించారు. సోన్ సీఐ గోవర్ధన్‌రెడ్డి అక్కడికి వెళ్లి వివరాలు తెలుసుకున్నారు. రజినీకాంత్ భార్య రాజశ్రీ ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ ప్రకాశ్ తెలిపారు.


