విదేశీ వద్దు.. స్వదేశీ ముద్దు
లక్ష్మణచాంద: విదేశీ వద్దు–స్వదేశీ ముద్దు అనే నినాదంతో ముందుకు సాగాలని నిర్మల్ జిల్లా సహ సంయోజక్ శివ పిలుపునిచ్చారు. ఈమేరకు సోన్ మండలం న్యూవెల్మల్ బొ ప్పారం గ్రామంలో, లక్ష్మణచాంద మండల కేంద్రంలో విద్యార్థులతో కలిసి స్వదేశీ జాగరణ మంచ్, స్వదేశీ పరుగు నిర్వహించారు. ఈ సందర్భంగా భారత్‌పై అమెరికా, చైనా, టర్కీ చేస్తున్న ఆర్థిక యుద్ధంపై విద్యార్థులకు, గ్రా మస్తులకు అవగాహన కల్పించారు. స్వదేశీ నినాదాన్ని ఒక జీవన విధానంగా అలవర్చుకుంటామని ఇప్పటి నుంచి స్వదేశీ వస్తువులనే వాడతామని, మన సంస్కృతి, సంప్రదాయాలు, మన వస్త్రాధారణ అన్నింటిలో స్వదేశీగా ఉంటామని ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాళ్లు లక్ష్మీనర్సయ్య, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.


