బుగ్గగూడం శివారులో యువకుడు..
కాసిపేట: కాసిపేట పోలీస్‌స్టేషన్ పరిధి బుగ్గగూడం శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో నాయిని రా జేష్(25) మృతిచెందినట్లు ఎస్సై ఆంజనేయులు తె లిపారు. ఆయన కథనం ప్రకారం.. కుమురం భీం జిల్లా తిర్యాణి మండలం నాయకపుగూడ చింతపల్లికి చెందిన నాయిడి రాజేష్ అదేగ్రామానికి చెందిన చెదం నాగేశ్‌లు బైక్‌పై బుగ్గ దేవాలయం సమీపంలోని సమ్మక్క–సారలమ్మ జాతరకు వెళ్లి తిరిగివస్తున్నారు. నాగేశ్ బైక్ అతి వేగంగా, అజాగ్రత్తగా నడపడంతో గురువారం తెల్లవారుజాము బుగ్గగూడం శివారు డంపింగ్‌యార్డు వద్ద అదుపు తప్పి కిందపడ్డారు. వెనుక కూర్చున్న రాజేష్‌కు తీవ్ర గాయాలై ఘటన స్థలంలో మృతి చెందాడు. మృతుడి మేనమామ చేనేని రాజమల్లు ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


