రోడ్డుప్రమాదంలో వ్యాన్ క్లీనర్..
రెబ్బెన: మండలకేంద్రంలోని జాతీయ రహదారిపై గురువారం తెల్లవారుజాము జరిగిన రోడ్డుప్రమాద ంలో వ్యాన్‌క్లీనర్ మృతి చెందినట్లు ఎస్సై వెంకటకృష్ణ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. కరీంనగర్ జిల్లా ఆరెపల్లికి చెందిన కొత్తపల్లి నరేందర్ (42) గత కొంతకాలంగా వ్యాన్ క్లీనర్‌గా పనిచేస్తున్నాడు. మహారాష్ట్ర నాగ్‌పూర్ నుంచి వ్యాన్ లోడ్‌తో కరీంనగర్‌కు బయల్దేరింది. మహారాష్ట్ర నుంచి వస్తున్న లారీ..రెబ్బెన జాతీయరహదారి ఫ్లైఓవర్‌పై లారీడ్రైవర్ మొహినుద్దీన్ అజాగ్రత్తగా నడుపుతూ ఒక్కసారిగా బ్రేక్ వేశాడు. వెనుక వస్తున్న వ్యాన్ డ్రైవర్ అంకడాల క్రిష్ణ అప్రమత్తమయ్యే లోపే లారీని ఢీకొట్టా డు. ప్రమాదంలో వ్యాన్ ముందు భాగం నుజ్జునుజ్జుయింది. తీవ్రగాయాలైన వ్యాన్‌క్లీనర్ నరేందర్ అక్కడికక్కడే మృతి చెందాడు. స్వల్పగాయాలైన వ్యాన్ డ్రైవర్ క్రిష్ణను ఆసుపత్రికి తరలించారు. మృతుడి భార్య రోజా ఫిర్యాదుతో లారీడ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.


