అరైవ్–అలైవ్.. ప్రమాదాలకు చెక్!
మంచిర్యాలక్రైం: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మృత్యు ఘంటికలు మోగుతున్నాయి. రోజురోజుకు ప్రమాదాల సంఖ్య పెరిగి రహదారులు రక్తసిక్తమవుతున్నాయి. మద్యం తాగి వాహనాలు నడపడం, రాంగ్‌రూట్‌లో వెళ్లడం, ర్యాష్ డ్రైవింగ్‌తో కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. మరికొందరు శాశ్వత అంగవైకల్యం బారిన పడుతున్నారు. ఈ ప్రమాదాలకు చెక్‌పెట్టేందుకు తెలంగాణ పోలీసు శాఖ ప్రతిష్టాత్మకంగా అరైవ్–అలైవ్ కార్యక్రమాన్ని చేపట్టింది. రోడ్డు భద్రతపై అవగాహన కల్పించడం, ట్రాఫిక్ నిబంధనలు పాటించడం, స్వీయ రక్షణతోనే ప్రమాదాలకు అడ్డుకట్ట వేసేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ప్రమాదాల నివారణకు పోలీస్, ఆర్టీవో, ఎకై ్సజ్, రెవెన్యూ, ఎన్‌హెచ్, ఎస్‌హెచ్, ఇంజినీరింగ్ శాఖల సమన్వయంతో విలేజ్ కమిటీలు ఏర్పాటు చేసింది. ఎక్కడ రోడ్డు ప్రమాదం జరిగితే అక్కడ కారణాలను విశ్లేషించి ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకుంటోంది.
ఉమ్మడి జిల్లాలో..
రోడ్డు ప్రమాదాల్లో ప్రమాదాల్లో మొదటి స్థానం నిర్మల్, రెండో స్థానంలో మంచిర్యాల ఉంది. గతేడాది 1373 రోడ్డు ప్రమాదాలు జరుగగా, 353 మంది మృత్యువాత పడ్డారు. మృతిచెందిన వారిలో 80 శాతం యువతే కావడం గమనార్హం.
విలేజ్ కమిటీలు ఇలా..
పోలీస్‌శాఖ, ఎకై ్సజ్, ఆర్టీవో, ఎన్‌హెచ్, ఎస్‌హెచ్, ఆర్‌ఆండ్‌బీ అధికారులు, విలేజ్ నుంచి ఇద్దరు, పది మందితో కూడిన విలేజ్ కమిటీ ఉంటుంది. జిల్లా పోలీస్ శాఖ అధికారి సమన్వయంతో పనిచేస్తారు. తరచూ ప్రమాదాలు జరిగే ప్రాంతాలను సందర్శిస్తారు. దీనికి కారకులెవరు అనేదానిపై విశ్లేషిస్తారు. సాంకేతిక లోపాలు, సైన్‌బోర్టులు, వేగనిరోధక నియంత్రణ, రేడియం స్టిక్కర్స్ ఏర్పాటుకు కృషి చేస్తారు. ఇప్పటివరకు జరిగిన ప్రమాదాలు ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం, మద్యం మత్తు, మితిమీరిన వేగం, రాంగ్ రూట్ డ్రైవింగ్, యూటర్న్ చేసుకునే ముందు ఇండికేట్ చేయకపోవడం, ద్విచక్రవాహనదారులు హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్లే అధిక శాతం మృత్యువాత పడుతున్నారని విలేజ్ కమిటీ సర్వేలో తేలింది.
గతేడాది ఉమ్మడి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదాలు


