పంట చేల నుంచి ఇళ్లలోకి చొరబడి..
● అడవి పందిని హతమార్చిన గ్రామస్తులు
తాంసి: మండల కేంద్రంలోని పంట చేల నుంచి అడవి పంది గురువారం ఇళ్లలోకి చొరబడింది. దీంతో జనం భయాందోళనకు గురయ్యారు. పలువురిపై దాడికి యత్నించింది. అప్రమత్తమైన గ్రామస్తులు కర్రలతో కొట్టి హతమార్చారు. రెండునెలల క్రితం గ్రామంలోకి వచ్చిన అడవిపంది ఒకరిని హతమార్చగా, మళ్లీ వరుసగా సంచరిస్తున్నాయి. అటవీ అధికారులు వెంటనే స్పందించి గ్రామంలోకి అడవి పందులు రాకుండా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
తనిఖీల్లో నగదు పట్టివేత
ఖానాపూర్: పట్టణంలోని ఇంద్రనగర్ శివారులో గురువారం ఎన్నికల లైన్ ప్రారంభ సర్వే బృందం (సర్వేలైన్ స్టార్ట్ టిక్ టీమ్) తనిఖీల్లో భాగంగా ద్విచక్రవాహనదారుడి నుంచి రూ.2,35,100 నగదు లభించాయి. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం ఒగులాపూర్‌తండాకు చెందిన భుక్య రాజేందర్ చిట్టీ డబ్బులతో బైక్‌పై ఖానాపూర్ వస్తున్నాడు. టీం ఇన్‌చార్జి, ఇరిగేషన్ ఏఈఈ రాథోడ్ విఠల్ ఆధ్వర్యంలో తనిఖీ చేశారు. ఆయన వద్ద ఉన్న నగదును స్వాధీనం చేసుకుని విచారించారు.
ఐదు టిప్పర్లు పట్టివేత
బోథ్: మండలంలో ఎలాంటి అనుమతి లేకుండా నిబంధనలకు విరుద్ధంగా మొరం తరలి స్తున్న ఐదు టిప్పర్ల లారీలను పోలీసులు బుధవారం రాత్రి మాటు వేసి పట్టుకున్నారు. మండలంలోని డేరా గ్రామ శివారులో పెద్దఎత్తున మొరం తవ్వకాలు చేసి తరలిస్తున్నారన్న ముందస్తు సమాచారంతో ఎస్సై పురుషోత్తం సిబ్బంది సాయికృష్ణ, శ్రీకాంత్, సుధాకర్‌తో కలిసి దాడులు నిర్వహించారు. మొరం లోడుతో వెళ్తున్న ఐదు టిప్పర్లను గుర్తించి సీజ్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. సదరు వాహన యాజమానులు, డ్రైవర్లపై కేసులు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
మిస్సింగ్ కేసు
ఆసిఫాబాద్‌రూరల్: మండలంలోని చిలాటిగూడ గ్రామానికి చెందిన బోయిరే మహేశ్ (19) కనిపించకపోవడంతో మిస్సింగ్ కేసు నమోదైంది. సీఐ బాలాజీ వరప్రసాద్ కథనం ప్రకారం.. ఈనెల 23న మహేశ్ ఇంటి నుంచి ఆదిలాబాద్‌కు వెళ్తున్నానని చెప్పి బయటకు వెళ్లాడు. కుటుంబీకులు సాయంత్రం ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ఛాప్ వచ్చింది. బంధువుల ఇళ్లలో, చుట్టూపక్కల వెతికిన ఆచూకీ దొరకలేదు. తండ్రి కిషన్ ఫిర్యాదు మేరకు గురువారం మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
పంట చేల నుంచి ఇళ్లలోకి చొరబడి..
పంట చేల నుంచి ఇళ్లలోకి చొరబడి..
పంట చేల నుంచి ఇళ్లలోకి చొరబడి..


