తీవ్రమైన ఇంటిగ్రేటెడ్ స్కూల్ వివాదం
ఖానాపూర్: ఖానాపూర్‌లో ఏర్పాటు చేయాల్సి న ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఉట్నూర్‌కు తరలించా రంటూ ఇంటిగ్రేటెడ్ సాధన సమితి ఆధ్వర్యంలో కరపత్రాల పంపిణీ వివాదానికి దారితీసింది. ఇంటిగ్రేటెడ్ స్కూల్ తరలించామని జేఏసీ, బీఆర్‌ఎస్, బీజేపీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని, స్థలం లేకే స్కూల్ ఏర్పాటు కాలేదని, దీనిపై ఆలయంలో ప్రమాణం చేసేందుకు సిద్ధమని ఎమ్మెల్యే ప్రకటించారు. దీంతో జేఏసీ నాయకులు తాము సైతం ప్రమాణం చేస్తామంటూ సోమవారం స్థానిక ముత్యాల పోచమ్మ ఆలయానికి తరలివచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితి సమీక్షించారు. ఎమ్మెల్యే రాకపోవడంతో జేఏసీ నాయకులు వెనుదిరిగి వెళ్లిపోయారు. కాగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు, బీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి తనస్థాయికి తగ్గ వ్యక్తులు కానప్పటికీ వారు వస్తే సవాల్ స్వీకరిస్తానని అనంతరం జరిగిన కాంగ్రెస్ సభలో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ప్రకటించారు.
గృహహింస కేసులో
ఒకరికి జైలు
ఖానాపూర్: గృహహింస కేసులో నిందితుడికి ఏడునెలల సాధారణ జైలుశిక్ష, రూ.2 వేల జరిమానా విధిస్తూ నిర్మల్ ప్రిన్సిపల్ అండ్ డిస్టిక్ర్ట్ సెషన్స్ జడ్జి ఎస్.శ్రీవాణి సోమవారం తీర్పు వెలువరించారు. మండలంలోని పాత ఎల్లాపూర్‌కు చెందిన ఆడెపు పుష్పలత ఫిర్యాదు మేరకు ఆమె భర్త వేణుగోపాల్‌పై 2012లో ఖానాపూర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా 498(ఏ) ఐపీసీ, డౌరీ నిరోధక చట్టంలోని 3, 4 సెక్షన్‌ల కింద కేసు నమోదైంది. విచారణ అనంతరం కోర్టులో జడ్జి పైవిధంగా తీర్పునిచ్చారు.
హత్య కేసులో జీవితఖైదు
ఆదిలాబాద్‌టౌన్: హత్య కేసులో నిందితుడు మడావి అయ్యుకు జీవితఖైదుతో పాటు రూ.15వేల జరిమానా విధిస్తూ ఫ్యామిలీ కోర్టు, 3వ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి పి.లక్ష్మికుమారి సోమవారం తీర్పునిచ్చినట్లు లైజన్ అధికారి గంగాసింగ్ తెలిపారు. 2018లో తలమడుగు పోలీస్‌స్టేషన్‌లో హత్య కేసు నమోదైంది. అప్పటి సీఐ ప్రదీప్ విచారణ చేపట్టి చార్జిషీటు దాఖలు చేశారు. సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టగా నేరం రుజువుకావడంతో జడ్జి పైవిధంగా తీర్పునిచ్చినట్లు వివరించారు.
ఆదిలాబాద్‌టౌన్: హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్షతో పాటు రూ.2వేల జరిమానా విధిస్తూ జిల్లా జడ్జి ప్రభాకర రావు సోమవారం తీర్పునిచ్చినట్లు లైజన్ అధికారి గంగాసింగ్ తెలిపారు. సిరికొండ మండలం పొన్న గ్రామానికి చెందిన బగనూరే జ్ఞానేశ్వర్ అదృశ్యమైనట్లు 2020 నవంబర్ 8న ఇచ్చోడ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. జాదవ్ శ్రీనివాస్, సిందే అచ్చత్, సిందే గోవింద్‌రావు, సిందే రాంకిషన్ కలిసి జ్ఞానేశ్వర్‌ను ఇచ్చోడలో హత్య చేసి మహారాష్ట్రలోని పిప్పల్‌గావ్ ఘాట్‌లో పడేసినట్లు విచారణలో తేలింది. అప్పటి సీఐ నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నేరం రుజువుకావడంతో జాదవ్ శ్రీనివాస్‌కు జీవితఖైదు విధిస్తూ జడ్జి తీర్పునిచ్చినట్లు వివరించారు.
గంజాయి పట్టివేత


