ఆదివాసీ మహిళకు ప్రశంసాపత్రం అందజేత
కైలాస్‌నగర్: నార్నూర్ మండలం ఖైర్‌డాట్వా గ్రామానికి చెందిన పెందూర్ శాంతాబాయి గిరిజన మోహవ లడ్డూ యూనిట్‌ను స్థాపించి ఆదర్శంగా నిలిచింది. రాష్ట్రపతి భవన్ నుంచి అందిన ఆహ్వానం మేరకు ఇటీవల ఢిల్లీలో జరి గిన గణతంత్ర వేడుకల్లో పాల్గొని ప్రశంసాపత్రాన్ని అందుకుంది. గురువారం కలెక్టరేట్ స మావేశ మందిరంలో ఆమెను కలెక్టర్ రాజర్షి షా, ఎన్నికల సాధారణ పరిశీలకుడు హన్మంత్‌నాయక్ శాలువాతో సన్మానించారు. ప్రశంసాపత్రాన్ని అందజేసి అభినందించారు. వ్యాపార రంగంలో మరింత ఉన్నతంగా రాణించాలని ఈ సందర్భంగా వారు సూచించారు.


