ఉత్సాహంగా సీఎం కప్ పోటీలు
ఆదిలాబాద్‌రూరల్: ఆదిలాబాద్ అసెంబ్లీ స్థాయి సీఎం కప్ పోటీలు శుక్రవారం మండలంలోని చాందా (టి) ప్రభుత్వ పాఠశాల మైదానంలో ఉత్సాహంగా సాగాయి. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లెపూల నర్సయ్య ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలన్నారు. క్రీడలతో దేహ దారుఢ్యం పెంపొంతుందన్నారు. కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, అథ్లెటిక్స్ క్రీడాంశాల్లో పోటీలు రసవత్తరంగా సాగాయి. కార్యక్రమంలో జిల్లా గిరిజన క్రీడల అధికారి పార్థసారథి, డీవైఎస్‌వో శ్రీనివాస్, ఎంపీడీవో వంశీకృష్ణ, సర్పంచ్ మంజుషా, తదితరులు పాల్గొన్నారు.


