విధుల నుంచి సీఆర్‌పీ తొలగింపు
ఆదిలాబాద్‌టౌన్: విద్యాశాఖలో పనిచేస్తున్న ఓ కాంట్రాక్ట్ ఉద్యోగి ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించడాన్ని ప్రస్తావిస్తూ ‘ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన సీఆర్‌పీ’ శీర్షికన బుధవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి జిల్లా అడిషనల్ కలెక్టర్, ఇన్‌చార్జి డీఈవో ఎస్.రాజేశ్వర్ స్పందించారు. భీంపూర్ మండలం పిప్పల్‌కోటి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో క్లస్టర్ రిసోర్స్ పర్సన్ (సీఆర్‌పీ)గా పనిచేస్తున్న పి.రవీందర్‌ను విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఎంఈవో సమర్పించిన నివేదిక ప్రకారం సదరు ఉద్యోగి ఓ రాజకీయ పార్టీలో చేరడమే కాకుండా ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నట్లు నిర్ధారణ అయ్యిందన్నారు. ఈ విచారణ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకున్నట్లుగా వివరించారు.
విధుల నుంచి సీఆర్‌పీ తొలగింపు


