బల్దియాపై కాంగ్రెస్ జెండా ఎగురవేస్తాం
కై లాస్‌నగర్: మెజార్టీ వార్డులను కై వసం చేసుకుని ఆదిలాబాద్ మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని డీసీసీ అధ్యక్షుడు నరేశ్ జాదవ్ ధీమా వ్యక్తం చేశారు. మున్సిపల్ నామి నేషన్ల ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో శుక్రవా రం పార్టీ నేతలతో కలిసి ఎన్నికల అధికారుల కు కాంగ్రెస్ తరఫున ఏ–ఫామ్‌లు అందజేశా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టణంలోని 49వార్డులకు అభ్యర్థులను ఎంపి క చేసి నామినేషన్లు వేయాల్సిందిగా వారికి స మాచారం అందించామని చెప్పారు. పార్టీ బీ– ఫామ్ ఎవరికి దక్కిన మిగతా వారంతా వారి గెలుపుకోసం పనిచేస్తారని ఆయన స్పష్టం చేశారు. ఆయన వెంట డీసీసీ మాజీ అధ్యక్షుడు సాజీద్‌ఖాన్, ఆత్మ చైర్మన్ సంతోష్, ఏఎంసీ మాజీ చైర్మన్ సంజీవ్‌రెడ్డి తదితరులున్నారు.


