కుష్ఠు నిర్మూలనకు ‘స్పర్శ’
ఆదిలాబాద్‌టౌన్: కుష్ఠు నిర్మూలనకు ప్రభుత్వం చ ర్యలు చేపట్టింది. 2027 నాటికి దేశంలో మహమ్మారిని అంతమొందించేందుకు ప్రణాళికలు రూపొందించింది. ఇందులో భాగంగా అధికారులు గత నెలలో జిల్లా వ్యాప్తంగా 15రోజుల పాటు ఇంటింటి స ర్వే నిర్వహించారు. అనుమానితులను గుర్తించారు. ఆ తర్వాత పరీక్షలు నిర్వహించగా జిల్లాలో 11 కేసులు నమోదయ్యాయి. వ్యాధిపై మరింత విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా గాంధీజీ వర్ధంతి సందర్భంగా శుక్రవారం కుష్ఠు నివారణ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈనెల 30 నుంచి ఫిబ్రవరి 13వ తేదీ వరకు ‘స్పర్శ’ పేరిట లెప్రసీ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. విద్యార్థులు, అంగన్‌వాడీ కేంద్రాలు, గ్రామాల్లో వ్యాధి గురించి అవగాహన కల్పించనున్నారు.
సర్వేలో 11 కేసులు గుర్తింపు
దేశ వ్యాప్తంగా 2027 నాటికి వ్యాధిని నిర్మూలించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అనేక కార్యక్రమాల్లో స్పర్శ ఒకటి. గత నెల 17నుంచి 30వ తేదీ వర కు ఇంటింటి సర్వే నిర్వహించగా బజార్‌హత్నూర్‌లో రెండు, ఆదిలాబాద్ పట్టణంలోని శాంతినగర్‌లో రెండు, ఇచ్చోడలో ఒకటి, సొనాలలో ఒకటి, తాంసిలో ఒకటి, భీంపూర్‌లో ఒకటి, హస్నాపూర్‌లో ఒకటి, పిట్టబొంగరంలో ఒకటి, ఝరి పీహెచ్‌సీ పరిధిలో ఒకటి.. మొత్తం 11కేసులు నమోదయ్యా యి. జిల్లాలో ప్రస్తుతం 52మంది వ్యాధిగ్రస్తులున్న ట్లు వైద్యారోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు.
వ్యాధి లక్షణాలివే..
కుష్ఠు లక్షణాలున్నవారు సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పరీక్షలు చేయించుకోవాలని వై ద్యశాఖ అధికారులు సూచిస్తున్నారు. చర్మంపై స్ప ర్శ లేని మచ్చలు, మందమైన మెరిసే జిడ్డుగల చర్మం, చెవులు, వీపు, ఛాతిపై నొప్పిలేని బొడిపెలు, కనురెప్పల వెంట్రుకలు రాలిపోవడం, కనురెప్పలు మూతపడక పోవడం, ముక్కుదిబ్బడ, ముక్కు నుంచి రక్తం కారడం, కాళ్లు, చేతులకు తిమ్మిర్లు రా వడం, అరచేతులు, అరికాళ్లకు స్పర్శ లేకపోవడం, కాళ్లకు చెప్పులు జారిపోవడం, తెలియకుండానే చే తులు, కాళ్లలో బొబ్బలు రావడం, చేతివేళ్లు, కాలివే ళ్లు వంకర్లు తిరిగి అంగవైకల్యం రావడం లాంటి ల క్షణాలుంటే వెంటనే సమీప పీహెచ్‌సీలో వైద్య పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.


