ముగిసిన నామినేషన్ల గడువు
కైలాస్‌నగర్: మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల స్వీ కరణ గడువు శుక్రవారం ముగిసింది. చివరిరోజు అభ్యర్థులు భారీగా తరలివచ్చారు. దీంతో జిల్లా కేంద్రంలోని టీటీడీసీ కేంద్రం సందడిగా మారింది. నిర్ణీత గడువులోపు వచ్చిన వారందరినీ కేంద్రంలోకి అనుమతించారు. దీంతో రాత్రి 10గంటల వరకు ప్రక్రియ కొనసాగింది. చివరి నిమి షంలో పలువురు అభ్యర్థులు ఉరుకులు పరుగుల నడుమ కేంద్రానికి చేరుకున్నారు. బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ఎంపీ గోడం నగేశ్, ఎమ్మెల్యే పా యల్ శంకర్ హాజరయ్యారు. కాగా ఈ ప్రక్రియ కు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా పోలీసులు ప కడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రత్యేక బారికేడ్లను ఏర్పాటు చేసి అభ్యర్థులతో ప్రతిపాదకులను మాత్రమే అనుమతించారు. శనివారం నామినేషన్ల పరిశీలన ప్రక్రియ చేపట్టనున్నారు. నామినేషన్లు వేసిన అభ్యర్థులంతా విధిగా హాజ రు కావాలని ఎన్నికల అధికారులు సూచించారు.
బరిలో ఏఐఎఫ్‌బీ ప్యానల్
మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ రంగినేని మనీషా పవన్‌రావు తన ప్యానల్‌తో మున్సిపల్ ఎన్నికల బరిలో నిలిచారు. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (ఏఐఎఫ్‌బీ) తరఫున నామినేషన్ దాఖలు చేసిన ఆమె మరో 24మంది అభ్యర్థులను ఎంపిక చేసి బరిలో నిలిపారు. వారంతా పార్టీ తరఫున నామి నేషన్లు వేశారు. వారికి మద్దతుగా ఆమె హాజరయ్యారు. శుక్రవారం పవన్‌రావు ఎన్నికల అధికా రులను కలిసి పార్టీ ఏ–ఫామ్‌లు అందించారు.
కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్
మున్సిపల్ ఎన్నికల నామినేషన్ స్వీకరణ కేంద్రాన్ని కలెక్టర్ రాజర్షిషా సాధారణ ఎన్నికల పరిశీలకుడు హన్మంత్ నాయక్‌తో కలిసి పరిశీలించారు. ఆయన వెంట అడిషనల్ కలెక్టర్ ఎస్.రాజేశ్వర్, డీఎస్పీ ఎల్.జీవన్‌రెడ్డి తదితరులున్నారు.
నామినేషన్ల వివరాలు
మొదటిరోజు 08 రెండోరోజు 141
చివరిరోజు 572 మొత్తం721


