సీఎం దిష్టిబొమ్మ దహనం
ఆదిలాబాద్‌టౌన్: మాజీ సీఎం కేసీఆర్‌కు సిట్ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ బీఆర్‌ఎస్ ఆ ధ్వర్యంలో శుక్రవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయం ఎదుట సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొ మ్మ దహనం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న మాట్లాడుతూ.. ఎన్నికలు వచ్చిన ప్రతీసారి రే వంత్ సర్కార్ కుట్రలు చేస్తోందని ఆగ్రహం వ్య క్తం చేశారు. ప్రజల భద్రత దృష్ట్యా హోంశాఖ ఫోన్ ట్యాపింగ్ చేస్తుందని, కావాలనే బీఆర్‌ఎ స్ నేతలకు సిట్ నోటీసులిచ్చారని ఆరోపించా రు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రజలు గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు. నాయకులు ఇజ్జగిరి నారాయణ, మెట్టు ప్రహ్లాద్, సా జిదొద్దీన్, యాసం నర్సింగ్‌రావు పాల్గొన్నారు.


