‘బీజేపీతోనే పట్టణాభివృద్ధి’
ఆదిలాబాద్: బీజేపీతోనే పట్టణాభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేర్కొన్నారు. శనివారం పట్టణంలోని 22, 24, 21, 23, 1, 2 వార్డుల్లో బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్ట ణంలోని గాంధీచౌక్, శివాజీచౌక్ లాంటి రద్దీ ప్రాంతాల్లోని తోపుడు బళ్ల తొలగింపు ద్వారా ట్రాఫిక్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించామని తెలిపా రు. సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణంతో ప్రతీ వార్డును ఆదర్శంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. అర్హులకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద పక్కా ఇళ్లు మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్, ఎంఐఎం తెరవెనుక ఒక్కటయ్యాయని ఆరోపించారు. మహిళల భద్రత, యువతకు ఉపాధి అవకాశాల కోసం బీజేపీకి ఓటు వేయాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు గంట జీవన్, పద్మాగౌడ్, నవత, దశరథ్, గోవర్ధన్. పెంటాజీ, మల్లేశ్, సురేశ్, గణేశ్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


