‘ఎక్స్ అఫిషియో’కు ఆప్షన్లు స్వీకరించాలి
కై లాస్‌నగర్: మున్సిపల్ ఎక్స్ అఫిషియో సభ్యుల ఎంపిక కోసం తక్షణమే నోటీసులు జారీ చేసి, ఆప్ష న్లు స్వీకరించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ఆదేశించారు. మున్సిపల్ చైర్మన్, వైస్ చై ర్మన్ ఎన్నికల ప్రక్రియపై సోమవారం ఆయా జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక పరోక్ష విధానంలో జరుగుతుందన్నారు. ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు ఎక్స్ అఫిషియో హోదాలో ఏదో ఒక మున్సిపాలిటీని ఎంచుకోవాల్సి ఉంటుందన్నారు. ఫిబ్రవరి 11నుంచి 14 మధ్య ప్రజాప్రతినిధులకు నోటీసులు జారీ చేసి వారి ప్రాతినిధ్యాన్ని ఖరారు చేయాలని సూచించారు. కార్యక్రమంలో కలెక్టర్ రాజర్షి షా, సాధారణ ఎన్నికల పరిశీలకులు డి.హనుమంత్ నాయక్, అదనపు కలెక్టర్లు శ్యామలాదేవి, ఎస్. రాజేశ్వర్, ఆర్డీవో స్రవంతి, మున్సిపల్ కమిషనర్ జి.రాజు, ట్రెయినీ కలెక్టర్ సలోని చాబ్రా, అధికారులు పాల్గొన్నారు.


