ఎన్నికల నిర్వహణలో పీవోల పాత్ర కీలకం
కైలాస్‌నగర్: ఎన్నికల నిర్వహణలో ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారుల పాత్ర కీలకమని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజర్షి షా అన్నా రు. ఎన్నికల నిర్వహణపై సోమవారం జెడ్పీ సమావేశ మందిరంలో పీవో, ఏపీవోలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా ఎన్ని కలు నిర్వహించాలన్నారు. ఈసీ మార్గదర్శకాలను విధిగా పాటించాలని సూచించారు. ఎన్నికల్లో విధులు నిర్వహించే సిబ్బంది తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఫాం–12 అందజేయాలన్నారు. ప్రతీ పోలింగ్ కేంద్రంలో వెబ్‌కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని పర్యవేక్షిస్తామని తెలిపారు. పోటీలో నిలిచిన అభ్యర్థుల జాబితాను తప్పనిసరిగా పోలింగ్ కేంద్రం వద్ద ప్రదర్శించాలన్నారు. ఏజెంట్ల సంతకాలు సేకరించాలని సూచించారు. మధ్యాహ్నం 2 తర్వాత ఎవరినీ విధుల నుంచి రిలీ వ్ చేయవద్దని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎన్ని కల సాధారణ పరిశీలకులు హనుమంత్ నాయక్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎస్.రాజేశ్వర్, మున్సిపల్ కమిషనర్ రాజు, నోడల్ అధికారులు మనోహర్, ఫణిందర్, మాస్టర్ ట్రైనర్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
ప్రకృతి వ్యవసాయంతో లాభాలు
ఆదిలాబాద్‌టౌన్: రైతులు రసాయన ఎరువులకు స్వస్తి పలికి, లాభదాయకమైన ప్రకృతి సాగు వైపు మళ్లాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. జిల్లా కేంద్రంలోని ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాలలో కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వ విద్యాల యం, వ్యవసాయ, ఉద్యానశాఖలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన ‘ప్రకృతి వ్యవసాయం’పై ఐదు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని సోమవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. జిల్లాలో ఎంపిక చేసిన 20 క్లస్టర్లలోని 2,500 మంది రైతులకు ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పించడమే ఈ శిక్షణ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. ప్రకృతి వ్యవసాయంతో భూసారం పెరగడమే కాకుండా, పెట్టుబడి ఖర్చు తగ్గి దిగుబడి పెరుగుతుందని వివరించారు. ఈ సాగు చేసే రైతులకు ప్రభుత్వం నుంచి ఎకరాకు ఏడాదికి రూ.4వేల చొప్పు న ప్రోత్సాహకం అందుతుందని, మహిళా సంఘాల ద్వారా బయో ఇన్‌పుట్ రిసోర్స్ సెంటర్ల ఏర్పాటుకు రూ. లక్ష ఆర్థిక సాయం అందిస్తున్న ట్లు చెప్పారు. అనంతరం శిక్షణ బ్రోచర్‌ను ఆవి ష్కరించారు. అంతకుముందు కళాశాల ప్రాంగణంలో ఉద్యాన పంటల సాగును పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీధర్ స్వామి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి రవీందర్ రాథోడ్, జిల్లా పశు వైద్యశాల అధికారి రామారావు, ఆత్మ పీడీ రామ్‌కిషన్, ఏవో శివకుమార్, వ్యవసాయ శాస్త్రవేత్తలు శ్రీధర్, రఘువీర్, మల్లేశ్, వైస్‌ప్రిన్సిపాల్ ప్రభావతి, రైతులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.


