శేషజీవితం ఆనందంగా గడపాలి
ఆదిలాబాద్‌టౌన్: శేషజీవితాన్ని కుటుంబ స భ్యులతో ఆనందంగా గడపాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. ఉద్యోగ విరమణ పొందిన పోలీసు అధికారులకు స్థానిక పోలీసు కార్యాలయంలో సోమవారం సన్మాన కార్యక్రమం ని ర్వహించారు. ఉద్యోగ విరమణ పొందిన న లుగురు అధికారులను సత్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, శాంతిభద్రతల పరిరక్షణలో వారు అందించిన సేవలను కొని యాడారు. ఉద్యోగ విరమణ పొందిన వారిలో ఇచ్చోడ ఏఎస్సై జె.భూమన్న, తలమడుగు హె డ్‌కానిస్టేబుల్ ప్రభాకర్, సిరికొండ హెడ్‌కానిస్టేబుల్ నందులాల్, మావల కానిస్టేబుల్ అసదు ల్లా ఖాన్ ఉన్నారు. కార్యక్రమంలో సీసీ కొండ రాజు, వెంకటేశ్వర్లు, కవిత పాల్గొన్నారు.


