ఘనంగా జిల్లా స్థాయి ‘ప్రేరణ ఉత్సవ్‌’ | - | Sakshi
Sakshi News home page

ఘనంగా జిల్లా స్థాయి ‘ప్రేరణ ఉత్సవ్‌’

Feb 8 2026 4:07 AM | Updated on Feb 8 2026 4:07 AM

ఘనంగా జిల్లా స్థాయి ‘ప్రేరణ ఉత్సవ్‌’

ఘనంగా జిల్లా స్థాయి ‘ప్రేరణ ఉత్సవ్‌’

● కలెక్టర్‌ రాజర్షి షా ● అధికారులతో సమీక్ష

● కలెక్టర్‌ రాజర్షి షా ● అధికారులతో సమీక్ష

పారిశ్రామిక హబ్‌గా తీర్చిదిద్దుతాం

కై లాస్‌నగర్‌: ఆదిలాబాద్‌ను పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని కలెక్టర్‌ రాజర్షి షా తెలిపారు. శనివారం ఓ హోటల్‌లో కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఇంటరాక్టివ్‌ సెషన్‌ ఆన్‌ ఇండస్ట్రియల్‌ పొటెన్షియల్‌ ఆఫ్‌ ఆదిలాబాద్‌’ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజ రై మాట్లాడారు. ఆదిలాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ త్వరలో అందుబాటులోకి రానుందని తెలిపారు. జిల్లాలో సుమారు 10వేల ఎకరాల్లో భారీ ఇండస్ట్రియల్‌ పా ర్క్‌ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని పేర్కొన్నారు. కుంటాల, పొచ్చెర జలపాతాలు, నా గోబా ఆలయాన్ని కలుపుతూ టూరిజం సర్క్యూట్‌ అభివృద్ధికి పబ్లిక్‌–ప్రైవేట్‌ పార్ట్‌నర్‌షిప్‌ విధానంలో పెట్టుబడిదారులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. స్థానిక స్వయం సహాయక సంఘాలు తయారు చేసే డోక్రా ఆర్ట్‌ లాంటి ఉత్పత్తులకు అంతర్జాతీయ మా ర్కెట్‌ సౌకర్యం కల్పించేందుకు డిజిటల్‌ మార్కెటింగ్‌ వినియోగించాలని సూచించారు. ఐటీ టవర్‌ పూర్తయితే సాఫ్ట్‌వేర్‌ రంగంలో జిల్లా ముందడుగు వేస్తుందని, స్థానిక యువతకు ఉద్యోగావకాశాలు పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. సీఐఐ ప్రతినిధులు శివప్రసాద్‌రెడ్డి, సంజీవ్‌ దేశ్‌పాండే, సురేందర్‌రావు, సమీఉద్దీన్‌, గౌతమ్‌రెడ్డి, స్థానిక పరిశ్రమల సంఘాల సభ్యులు, జిన్నింగ్‌ మిల్లుల యజమానులు తదితరులు పాల్గొన్నారు.

పోలింగ్‌ కేంద్రాల్లో పకడ్బందీ ఏర్పాట్లు

పోలింగ్‌ కేంద్రాల్లో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ రాజర్షి షా ఆదేశించారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ఎన్నికల అధికారులతో సమావేశమై మాట్లాడారు. మున్సిపాలిటీ పరిధిలోని 49 వార్డుల్లో 216 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశామని, 62 ప్రాంతాల్లోని పోలింగ్‌ కేంద్రాల పర్యవేక్షణకు వార్డు అధికారులు, బిల్‌ కలెక్టర్లు, శానిటరీ జవాన్లతో కూడిన ప్రత్యేక బృందాలను నియమించినట్లు తెలిపారు. పోలింగ్‌ సజావుగా సాగేందుకు 2,154 మంది సిబ్బందిని నియమించినట్లు పేర్కొన్నారు. ప్రతీ కేంద్రం వద్ద ముగ్గురు పారిశుధ్య కార్మికులు, ఎలక్ట్రీషియన్‌ అందుబాటులో ఉంటారని తెలిపా రు. దివ్యాంగుల సౌకర్యార్థం ప్రతీ కేంద్రంలో ర్యాంపులు ఏర్పాటు చేయడంతో పాటు, వృద్ధులు, ది వ్యాంగుల కోసం 145 వీల్‌ చైర్లు, 125 ఆటోలు సి ద్ధం చేసినట్లు వెల్లడించారు. ఏర్పాట్లను మున్సిపల్‌ ఇంజినీర్లు, శానిటేషన్‌ అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. స్థానిక సంస్థల అడిషనల్‌ కలెక్టర్‌ రాజేశ్వర్‌, నోడల్‌ అధికారి మనోహర్‌, మున్సిపల్‌ కమిషనర్‌ రాజు తదితరులున్నారు.

ఈవీఎం గోదాం తనిఖీ

జిల్లా కేంద్రంలోని శాంతినగర్‌లోగల ఈవీఎంల గోదాంను కలెక్టర్‌ రాజర్షి షా తనిఖీ చేశారు. గోదాం పరిసరాల్లో నిరంతరం నిఘా ఉండాలని, అగ్నిమాపక పరికరాలు సిద్ధంగా ఉంచుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎన్నికల విభాగం పర్యవేక్షకురాలు పంచపూల, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.

ఆదిలాబాద్‌టౌన్‌: స్థానిక కేంద్రీయ విద్యాలయం ఆవరణలో జిల్లా స్థాయి ‘ప్రేరణ ఉత్సవ్‌’ నిర్వహించారు. జాతీయ పతాకాన్ని ఎగురవేసి జాతీ య గీతాన్ని ఆలపించారు. కలెక్టర్‌ రాజర్షి షా మా ట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా దాదాపు 40 పాఠశాలల నుంచి ఎంపికై న విద్యార్థులు కార్యక్రమంలో పాల్గొన్నట్లు తెలిపారు. వివిధ పోటీలు నిర్వహించి ప్రతిభ కనబరిచిన ఒక బాలుడు, ఒక బాలిక ను ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేసి గుజరాత్‌లోని వాద్‌నగర్‌ పంపనున్నట్లు తెలిపారు. ప్రిన్సిపాల్‌ అశోక్‌, జిల్లా సైన్స్‌ అధికారి భాస్కర్‌, క్వాలిటీ కోఆర్డినేటర్‌ అజయ్‌, ఉపాధ్యాయులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement