అద్దె రేట్లు పెంచాలి
ఆదిలాబాద్: అద్దె రేట్లు పెంచాలని ఫోర్ వీల ర్స్ డ్రైవర్ అసోసియేషన్ జిల్లా ప్రతినిధి రవి డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని ప్రెస్‌కబ్‌లో శనివారం నిర్వహించిన సమావేశంలో మా ట్లాడారు. డీజిల్ ధరలు పెరుగుతున్నా 2017 లో నిర్ణయించిన రూ.33వేల అద్దెనే నేటికీ చె ల్లించడం సరికాదన్నారు. అద్దెను రూ.50వేలకు పెంచి, బిల్లులు సకాలంలో చెల్లించాలని, కేవలం ఎల్లో ప్లేట్ వాహనాలకే అనుమతివ్వాలని డిమాండ్ చేశారు. డిమాండ్లు నెరవేర్చేదాకా పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అసోసియేషన్ సభ్యులు శ్రీకాంత్, ఇమ్రాన్‌ఖాన్, రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.


