‘కాంగ్రెస్‌కు పట్టం కట్టాలి’ | - | Sakshi
Sakshi News home page

‘కాంగ్రెస్‌కు పట్టం కట్టాలి’

Feb 8 2026 4:07 AM | Updated on Feb 8 2026 4:07 AM

‘కాంగ్రెస్‌కు పట్టం కట్టాలి’

‘కాంగ్రెస్‌కు పట్టం కట్టాలి’

కైలాస్‌నగర్‌: పట్టణాభివృద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్యమని, మున్సిపల్‌ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులకు పట్టం కట్టాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, బోధన్‌ ఎమ్మెల్యే పీ సుదర్శన్‌రెడ్డి సూచించారు. శనివారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రేషన్‌ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు దివంగత సీఎం రాజశేఖరరెడ్డి హయాంలోనే ఇచ్చామని, మళ్లీ రేవంత్‌రెడ్డి ప్రభుత్వమే ఇస్తోందని పేర్కొన్నారు. ఉర్దూ అకాడమీ చైర్మన్‌ తాహెర్‌ బిన్‌ హందన్‌, రాష్ట్ర వక్ఫ్‌ బోర్డ్‌ చైర్మన్‌ సయ్యద్‌ అజ్మాతుల్లా హుస్సేన్‌, మాజీ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు నరేశ్‌ జాదవ్‌, నియోజకవర్గ ఇన్‌చార్జి కంది శ్రీనివాసరెడ్డి, కిసాన్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొరంచు శ్రీకాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement