రివర్ క్రాసింగ్ పోటీలకు ఎంపిక
ఆదిలాబాద్: ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ దుర్గా ఘాట్ వద్ద ఆక్వా డెవిల్స్ ఆధ్వర్యంలో ఈ నెల 8న నిర్వహించనున్న 26వ కృష్ణా రివర్ క్రాస్ స్విమ్మింగ్ పోటీలకు జిల్లా కేంద్రానికి చెందిన స్విమ్మింగ్ కోచ్ కొమ్ము కృష్ణ, కొమ్ము చరణ్ తేజ్ ఎంపికయ్యారు. పోటీల్లో భాగంగా కృష్ణా నదిని ఈదుతూ దాటాల్సి ఉంటుందని కోచ్ కృష్ణ తెలిపారు. ప్రతిష్టాత్మక రివర్ క్రాసింగ్ పోటీలకు వీరి ఎంపికపై డీవైఎస్వో జక్కుల శ్రీనివాస్, ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బాలూరి గోవర్ధన్‌రెడ్డి, పీఈటీల సంఘం అధ్యక్షుడు పార్థసారధి హర్షం వ్యక్తంజేశారు.


